- Suicide: అప్పారావును పోలీసులే చంపారు.. కుటుంబసభ్యుల ఆరోపణ
ఏలూరు జిల్లా భీమడోలు పీఎస్‌లో ఓ నిందితుడు అనుమానాస్పదంగా మృతి చెందాడు. గొలుసు చోరీ కేసులో మూడ్రోజుల క్రితం అప్పారావును పోలీసులు అరెస్టు చేశారు. కాగా నిందితుడు ఇవాళ ఉదయం పోలీస్ స్టేషన్‌లోని బాత్రూమ్లో అనుమానాస్పదంగా మరణించినట్లు వారు తెలిపారు.
- పదో తరగతి పరీక్షల నిర్వహణలో ప్రభుత్వ వైఫల్యం: నక్కా ఆనంద్ బాబు
వైకాపా ప్రభుత్వం వచ్చిన తర్వాత తొలిసారిగా జరుగుతున్న 10వ తరగతి పరీక్షలలో ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోందని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు నక్కా ఆనంద్ బాబు విమర్శించారు.
- High court: ఆ కేసులో చింతమనేని ప్రభాకర్‌కు ఊరట
తెదేపా సీనియర్ నేత చింతమనేని ప్రభాకర్‌కు హైకోర్టులో ఊరట లభించింది. ఆయనపై నమోదైన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో తదుపరి చర్యలు చేపట్టవద్దంటూ ఉన్నత న్యాయస్థానం స్టే విధించింది.
- వేసవి శిక్షణా శిబిరాన్ని ప్రారంభించిన మంత్రి రోజా.. బైరెడ్డి సిద్ధార్థరెడ్డి గైర్హాజరు
విజయవాడ మున్సిపల్ క్రీడా మైదానంలో 'శాప్' ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వేసవి శిక్షణా శిబిరానికి ఆ సంస్థ ఛైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి హాజరుకాకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే ఆయన పార్టీ మారుతున్నారన్న ప్రచారం నేపథ్యంలో.. మంత్రి రోజా వచ్చినా.. ఆ కార్యక్రమానికి బైరెడ్డి గైర్హాజరు కావడం పార్టీ వర్గాల్లో అనుమానాలు రేకెత్తిస్తోంది.
- మైనర్‌పై అత్యాచారం.. పోలీసు స్టేషన్ గదిలోకి తీసుకెళ్లి..
మైనర్‌పై అత్యాచారానికి పాల్పడ్డారు ఆరుగురు వ్యక్తులు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్‌లోని లలిత్‌పుర్‌లో జరిగింది. నిందితుల్లో పోలీసు ఇన్స్పెక్టర్ కూడా ఉన్నాడు.
- వృద్ధుడి గొప్ప సంకల్పం.. మండుటెండలో 26 ఏళ్లుగా అదే పని..!
మండుటెండలో అడవి మార్గంలో ప్రయాణించే చిరు వ్యాపారుల కోసం 26 ఏళ్లుగా జలయజ్ఞం చేస్తున్నాడు ఓ సామాన్యుడు. వేసవిలో ఉదయం నుంచి సాయంత్రం వరకు అడవిలోనే ఉండి.. అటువైపు వచ్చేవారికి చల్లటి మంచి నీరు అందిస్తున్నాడు. మూగ జీవాల కోసం నీటి తొట్టెలు నిర్మించి.. వాటి దాహార్తిని తీర్చుతున్నాడు.
- బైడెన్ సర్కార్ కీలక నిర్ణయం.. భారతీయులకు ప్రయోజనం!
వర్క్ పర్మిట్ వీసా గడువు ముగుస్తున్న కొన్ని కేటగిరీల వారికి మరో 18 నెలల పాటు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది అమెరికా ప్రభుత్వం. ఈ నిర్ణయంతో భారతీయులతో పాటు వేలాది మంది వలసదారులకు ఊరట కలగనుంది.
- ఆ షేర్లన్నీ కొనేశారు- ఎల్ఐసీ ఐపీఓ స్పందన ఎలా ఉందంటే?
బుధవారం ప్రారంభమైన ఎల్ఐసీ ఐపీఓకు విశేష స్పందన లభిస్తోంది. పాలసీదారుల విభాగానికి కేటాయించిన షేర్లన్నీ సబ్‌స్క్రైబ్ కావడం విశేషం. తొలి రెండు గంటల్లోనే దాదాపు మూడింట ఒక వంతు షేర్లకు సభ్యత్వం పొందారు పెట్టుబడిదారులు.
- సినీ అప్డేట్స్: ఓటీటీలో 'బీస్ట్'.. సూర్య గోవా ప్లాన్
మరికొన్ని సినిమా అప్డేట్స్ వచ్చాయి. ఇందులో 'బీస్ట్' ఓటీటీ, సూర్య 41, సామ్ 'యశోద్', వెంకీమామ 'ఎఫ్ 3' చిత్రాల సంగతులు ఉన్నాయి. ఆ వివరాలు..
- క్రికెట్ అకాడమీ కోసం ప్లాట్.. 33ఏళ్ల తర్వాత రిటర్న్ ఇచ్చిన గావస్కర్
క్రికెట్ అకాడమీ కోసం మహారాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన ప్లాట్‌ను 33 ఏళ్ల తర్వాత తిరిగి ఇచ్చేశారు బ్యాటింగ్ దిగ్గజం సునీల్ గావస్కర్. అకాడమీ నెలకొల్పాలన్న ప్రయత్నాలు విఫలం కావడం వల్ల.. ఠాక్రే సర్కారు అభ్యర్థన మేరకు ప్లాట్‌ను రిటర్న్ ఇచ్చారు.
ప్రధాన వార్తలు