ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

AP TOP NEWS: ఏపీ ప్రధాన వార్తలు @9PM - ఏపీ ముఖ్యవార్తలు

.

AP TOP NEWS @9PM
AP TOP NEWS @9PM

By

Published : Dec 30, 2021, 9:03 PM IST

Updated : Dec 30, 2021, 9:14 PM IST

  • మమ్మల్ని అవమానిస్తున్నారు : ఉద్యోగ సంఘాల నేతలు
    పీఆర్సీపై ఆర్థికశాఖ అధికారులతో జరిగిన భేటీలో ఎలాంటి పురోగతి కనిపించలేదని ఉద్యోగ సంఘాల నాయకులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏపీఎన్జీవో, ఏపీ రెవెన్యూ తదితర సంఘాలతో అధికారుల భేటీ నిర్వహించినప్పటికీ.. సమస్య కొలిక్కి రాలేదని ఉద్యోగ సంఘాల నాయకులు తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • Peddireddy On Pensions: జనవరి నుంచి రూ.2,500 పంపిణీ: మంత్రి పెద్దిరెడ్డి
    జనవరి నుంచి పింఛను లబ్ధిదారులకు రూ.2,500 పంపిణీ చేయనున్నట్లు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. ఇందుకోసం ప్రభుత్వం రూ. 1,570.60 కోట్లు విడుదల చేసిందన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • Cinema Theaters Open: సీజ్​ చేసిన థియేటర్లు తెరిచేందుకు ప్రభుత్వం అనుమతి
    సినిమా థియేటర్ల యజమానులకు రాష్ట్ర ప్రభుత్వం ఊరట కల్పించింది. రాష్ట్రంలోని 9 జిల్లాల పరిధిలో సీజ్‌ చేసిన 83 థియేటర్లు తెరిచేందుకు అనుమతిచ్చింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • MLC Gorati Venkanna: ఎమ్మెల్సీ గోరటి వెంకన్నకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు
    కవి, రచయిత, ఎమ్మెల్సీ గోరటి వెంకన్నకు అపూర్వగౌరవం దక్కింది. 2021 ఏడాదికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వరించింది. 'వల్లంకి తాళం' కవితా సంపుటికి ఈ పురస్కారం వచ్చింది. మానవీయ సంస్కృతి, స్వచ్ఛమైన ప్రకృతి మేళవింపుగా 'వల్లంకి తాళం' కవిత సంపుటిని గోరటి తీర్చిదిద్దారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • Covaxin on Children: పిల్లలపై కొవాగ్జిన్‌ ఉత్తమ ఫలితాలు: భారత్‌ బయోటెక్‌
    పిల్లలపై నిర్వహించిన కొవాగ్జిన్‌ టీకా క్లినికల్‌ ట్రయల్స్‌ ఫలితాలను భారత్‌ బయోటెక్‌ సంస్థ ప్రకటించింది. 2-18 ఏళ్ల వారిపై నిర్వహించిన క్లినికల్‌ ట్రయల్స్‌లో కొవాగ్జిన్‌ ఉత్తమ ఫలితాలను కనబరిచిందని వెల్లడించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • అరుణాచల్​లో మరో 15 ప్రాంతాలకు చైనా నామకరణం!
    చైనా మరోమారు దందుడుకు చర్యకు పాల్పడింది. అరుణాచల్ ప్రదేశ్​లో 15 ప్రాంతాలకు అధికారిక చైనీస్ పేర్లు పెడుతున్నట్లు ప్రకటించింది. గ్లోబల్​ టైమ్స్​ ఈమేరకు కథనం ప్రచురించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • రఫేల్​కు పోటీగా చైనా జెట్​లు కొన్న పాక్​
    భారత్​ అత్యంత శక్తిమంతమైన రఫేల్ యుద్ధ విమానాలను కొనుగోలు చేయడం చూసి ఓర్వలేకపోతోంది పాకిస్థాన్​. అందుకే మనకు పోటీగా చైనా నుంచి J-10C యుద్ధ విమానాలను కొంటోంది. మార్చి 23న పాకిస్థాన్​ డే వేడుకల్లో ఇవి తమకు అందుతాయని పాక్ హోంమంత్రి వెల్లడించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • 'మరో ఐదేళ్లు జీఎస్టీ పరిహారం ఇవ్వాల్సిందే'
    కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు అందించే జీఎస్టీ పరిహారాన్ని మరో ఐదేళ్లపాటు పొడిగించాలని పలు రాష్ట్రప్రభుత్వాలు డిమాండ్ చేశాయి. అంతేకాక కేంద్ర ప్రభుత్వ పథకాల్లో కేంద్రం వాటాను కూడా పెంచాలన్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • దక్షిణాఫ్రికాపై గెలుపు.. టీమ్​ఇండియా ఖాతాలో పలు రికార్డులు
    సఫారీ గడ్డపై ఈ సిరీస్​లో తొలి విజయం అందుకున్న కోహ్లీసేన.. పలు రికార్డులు సృష్టించింది. ఇంతకీ ఆ ఘనతలేంటి? వాటి సంగతేంటి? పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • నాని కొత్త సినిమా జీరో లుక్.. 'వాలిమై' ట్రైలర్
    కొత్త సినిమా అప్డేట్స్ వచ్చేశాయి. ఇందులో అంటే సుందరానికీ, వాలిమై, పుష్ప, జయమ్మ పంచాయతీ, విక్రమ్ వేదా హిందీ రీమేక్, అన్​స్టాపబుల్ విత్ ఎన్​బీకే టాక్ షోకు సంబంధించిన కొత్త సంగతులు ఉన్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
Last Updated : Dec 30, 2021, 9:14 PM IST

ABOUT THE AUTHOR

...view details