ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విద్యార్థులను ఆదుకుంటానని చెప్పిన జగన్మోహన్‌రెడ్డి... అధికారంలోకి వచ్చాక విధివిధానాలు, ఆలోచన లేకుండా ప్రవర్తిస్తున్నారని టీఎన్‌ఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు బ్రహ్మం చౌదరి విమర్శించారు. అమ్మఒడి పథకం కింద 43లక్షల మంది విద్యార్థులనే అర్హులుగా ప్రకటించారని.. ఇంటిలో ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమందికి లబ్ధి చేకూరుస్తాని చెప్పి మాటమార్చారని దుయ్యబట్టారు. ప్రతిపనిలో, ప్రభుత్వ శాఖలవారీగా జే-ట్యాక్స్ వసూలుచేస్తున్న సీఎం అమ్మఒడి లబ్ధిదారుల నుంచి సైతం మామూళ్లు తీసుకుంటున్నారని ఆరోపించారు. పశ్చిమగోదావరిజిల్లా కొత్తగూడెంలో మధ్యాహ్నభోజనంలో బల్లి వచ్చిందని.. ముఖ్యమంత్రి అమలు చేస్తున్న కొత్త మెనూ ఇదేనా అని ఎద్దేవా చేశారు.
'మధ్యాహ్నభోజనంలో బల్లి... ఇదేనా మీ కొత్త మెనూ' - TNSF PRESIDENT ALLIGITIONS ON MID DAY MEALS
పశ్చిమ గోదావరిజిల్లా కొత్తగూడెంలో మధ్యాహ్నభోజనంలో బల్లి వచ్చిందని...ఇదేనా పేద విద్యార్థులకు ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన కొత్త మెనూ అని టీఎన్‌ఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు బ్రహ్మం చౌదరి విమర్శించారు.విద్యారంగంలో రూ.16 వేల 30కోట్లు కేటాయించిన ప్రభుత్వం... ఇప్పటివరకు కేవలం 8కోట్లు మాత్రమే ఖర్చు చేశారని ఆయన ఆరోపించారు
!['మధ్యాహ్నభోజనంలో బల్లి... ఇదేనా మీ కొత్త మెనూ' BRAHMAM CHOUDHARY ALLIGITIONS](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5878621-581-5878621-1580271328385.jpg)
'మధ్యాహ్నభోజనంలో బల్లి...ఇదేనా మీ కొత్త మెనూ'
'మధ్యాహ్నభోజనంలో బల్లి...ఇదేనా మీ కొత్త మెనూ'