రాష్ట్రంలో పదో తరగతి ఫలితాలను విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ విడుదల చేశారు. www.bse.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా ఫలితాలను తెలుసుకోవచ్చని పరీక్షల నిర్వహణ డైరెక్టర్ తెలిపారు. 2020 మార్చి, 2021 జూన్‌కు సంబంధించి సబ్జెక్టుల వారీగా.. విద్యార్థుల ప్రతిభ ఆధారంగా గ్రేడ్లు ఇచ్చామన్నారు.
ఫార్మేటివ్, సమ్మేటివ్ అసెస్‌మెంట్ ఆధారంగా గ్రేడ్లు
ఫార్మేటివ్, సమ్మేటివ్ అసెస్‌మెంట్ ఆధారంగా గ్రేడ్లు విభజన చేసినట్లు మంత్రి సురేశ్ వెల్లడించారు. గ్రేడ్ల వల్ల 6.26 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం కలిగిందన్నారు. ఎఫ్‌ఏకు 50 శాతం, ఎస్‌ఏకు 50 శాతం కేటాయించి గ్రేడ్లు విభజన చేశామన్నారు. గ్రేడ్ల కేటాయింపు వల్ల ఏ విద్యార్థికీ నష్టం జరగదన్నారు.