రాష్ట్ర ప్రభుత్వం, అధికారుల మధ్య అసమానతలు తొలగించేందుకు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిపాలన సర్వీసును అమల్లోకి తీసుకురావాలని ప్రభుత్వ ఉద్యోగుల సంఘం డిమాండ్ చేసింది. సరైన విధి విధానాల నిర్వహణ ద్వారా.. అన్ని వర్గాల సుస్థిర అభివృద్ధి సాధనలో ఈ పరిపాలన సర్వీసు ప్రముఖ పాత్ర పోషిస్తుందని అభిప్రాయపడింది. రాష్ట్రంలో వివిధ శాఖలలో.. సుమారు 40 రకాల గెజిటెడ్ స్థాయి పోస్టులు, డైరెక్ట్ రిక్రూట్మెంట్ పద్దతిలో ఏపీపీఎస్సీ ద్వారా గ్రూప్-1 స్థాయి అధికారులతో నియామకాలు జరుగుతున్నాయని తెలిపింది. వీరి వృత్తి పురోగతి, పదోన్నతుల విషయాలలో చాలా వివక్షత, అసమానతలు చోటు చేసుకున్నాయని.. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కె.రామ సూర్యనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. వివిధ శాఖల మధ్య నెలకొన్న అసమానతల దిద్దుబాటుకు.. పరిపాలన సర్వీస్ ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. ఈ అంశంపై సమగ్రంగా చర్చించేందుకు నాలుగు చోట్ల మేథోమథన సమావేశాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
Govt Employees: 'ఏపీ రాష్ట్ర పరిపాలన సర్వీసును అమల్లోకి తీసుకురావాలి'
వివిధ శాఖల మధ్య నెలకొన్న అసమానతల దిద్దుబాటుకు..ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిపాలన సర్వీసును అమల్లోకి తీసుకురావాలని ప్రభుత్వ ఉద్యోగుల సంఘం డిమాండ్ చేసింది. సరైన విధి విధానాల నిర్వహణ ద్వారా.. అన్ని వర్గాల సుస్థిర అభివృద్ధి సాధనలో ఈ పరిపాలన సర్వీసు ప్రముఖ పాత్ర పోషిస్తుందని అభిప్రాయపడింది.
'ఏపీ రాష్ట్ర పరిపాలన సర్వీసును అమల్లోకి తీసుకురావాలి'