ఫిబ్రవరి 3, 4 తేదీల్లో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో పర్యటించనున్నారు. బుధవారం సాయంత్రం 4.25 గంటలకు విజయవాడ నుంచి తిరుపతి బయలుదేరి వెళ్లనున్నారు. సాయంత్రం 6.45 గంటలకు చిత్తూరు కలెక్టర్, ఎస్పీ సహా జిల్లా అధికారులతో సమావేశమవుతారు. పంచాయతీ ఎన్నికల నిర్వహణ, ఏర్పాట్లపై సమీక్షించనున్నారు.
బుధవారం నుంచి నాలుగు జిల్లాలో ఎస్ఈసీ పర్యటన - ఎస్ఈసీ పర్యటన తాజా వార్తలు
బుధవారం నుంచి నాలుగు జిల్లాలో ఎస్ఈసీ నిమ్మగడ్డ పర్యటించనున్నారు. చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో రెండు రోజుల పాటు పర్యటించి ఎన్నికల నిర్వహణ, ఏర్పాట్లపై జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు.

గురువారం ఉదయం 8 గంటలకు తిరుపతి నుంచి నెల్లూరు వెళ్తారు. ఉదయం 10 గంటలకు నెల్లూరు జిల్లా ఉన్నతాధికారులతో సమీక్షిస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు నెల్లూరు నుంచి ఒంగోలు బయలుదేరి..మధ్యాహ్నం 2 గంటలకు ప్రకాశం జిల్లా కలెక్టర్, ఎస్పీ సహా ఉన్నతాధికారులతో సమావేశమవుతారు. సాయంత్రం 4 గంటలకు ఒంగోలు నుంచి గుంటూరుకు చేరుకొని..సాయంత్రం 6 గంటలకు జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. అనంతరం అదే రోజు రాత్రి రాత్రి 9.30 గంటలకు తిరిగి విజయవాడ చేరుకుంటారు.
ఇదీచదవండి: ముగిసిన తొలిదశ ఎన్నికల నామినేషన్ల పరిశీలన