రేపట్నుంచి 4 రోజులపాటు రాష్ట్రంలో ఎస్ఈసీ నిమ్మగడ్డ పర్యటించనున్నారు. రేపు, ఎల్లుండి ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాల్లో.. ఫిబ్రవరి 3, 4 తేదీల్లో చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో ఎన్నికల ఏర్పాట్ల గురించి అధికారులతో మాట్లాడనున్నారు. ఎన్నికల నిర్వహణ, ఏర్పాట్లపై కలెక్టర్లు, డీఐజీలు, ఎస్పీలు, ఉన్నతాధికారులతో ఎస్ఈసీ సమీక్ష నిర్వహించనున్నారు.
సోమవారం శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో పర్యటించనున్న ఎస్ఈసీ...సాయంత్రం 4.30 గం.కు శ్రీకాకుళం జిల్లా అధికారులతో, రాత్రి 7 గం.కు విజయనగరం జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. రాత్రికి విశాఖకు చేరుకొని అక్కడే బస చేయనున్నారు. మంగళవారం ఉదయం 9 గం.కు విశాఖ జిల్లా అధికారులతో, 1.30 గం.కు తూర్పుగోదావరి, రాత్రి 7 గం.కు పశ్చిమగోదావరి జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు.