రాష్ట్రంలోని స్థానిక సంస్థల ఎన్నికల్లో పాల్గొనేందుకు నాలుగు పార్టీలకు అనుమతి ఇస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆమ్ ఆద్మీ పార్టీ, మహిళా జనశక్తి పార్టీ, ఖ్వామీ ఇత్తేహాద్ రిపబ్లికన్ పార్టీ, నవరంగ్ కాంగ్రెస్ పార్టీలు రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో పాల్గొనేందుకు నమోదు చేసుకున్నట్లుగా ఎస్ఈసీ వెల్లడించింది.
SEC: స్థానిక సంస్థల ఎన్నికల్లో పాల్గొనేందుకు 4 పార్టీలకు ఎస్‌ఈసీ అనుమతి - పార్టీలను రాజకీయ పార్టీలుగా నమోదు చేస్తూ నోటిఫికేషన్
![SEC: స్థానిక సంస్థల ఎన్నికల్లో పాల్గొనేందుకు 4 పార్టీలకు ఎస్‌ఈసీ అనుమతి ఎస్‌ఈసీ అనుమతి](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-13200099-219-13200099-1632832493306.jpg)
ఎస్‌ఈసీ అనుమతి
17:50 September 28
4 పార్టీలను రాజకీయ పార్టీలుగా నమోదు చేస్తూ నోటిఫికేషన్
స్థానిక సంస్థల ఎన్నికల్లో పాల్గొనేందుకు ఈ నాలుగు పార్టీలనూ రాజకీయ పార్టీలుగా రిజిస్టర్ చేస్తూ ఎస్ఈసీ నోటిఫికేషన్ ఇచ్చింది. ఆమ్ ఆద్మీ పార్టీకి దిల్లీలో, పంజాబ్లో కేటాయించినట్లుగానే ఇక్కడ కూడా చీపురునే ఎన్నికల గుర్తుగా కేటాయించారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని ఆదేశాలు ఇచ్చారు.
ఇదీ చదవండి
Badwel bypoll 2021: బద్వేల్ ఉపఎన్నిక.. తెదేపా అభ్యర్థి ఖరారు..వైకాపా నుంచి ఎవరంటే..!
Last Updated : Sep 28, 2021, 7:37 PM IST