ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రెవెన్యూ ఉద్యోగుల అసోసియేషన్ కార్యవర్గం ఎన్నిక ఏకగ్రీవమే! - AP Revenue Association election news

రెవెన్యూ ఉద్యోగుల అసోసియేషన్ కార్యవర్గ ఎన్నిక ప్రక్రియ కొనసాగుతోంది. కార్యవర్గంలో భాగంగా అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవితో పాటు కార్యదర్శి, సభ్యుల ఎన్నిక కోసం ఒక బృందం మాత్రమే నామినేషన్లను దాఖలు చేసింది. ఫలితంగా.. కార్యవర్గం ఎన్నిక ఏకగ్రీవం కానుంది.

AP Revenue Association Election will be anonymous
రెవెన్యూ ఉద్యోగుల అసోసియేషన్ కార్యవర్గం ఎన్నిక ఏకగ్రీవమే..!

By

Published : Oct 3, 2020, 2:50 PM IST

రాష్ట్రంలోని రెవెన్యూ ఉద్యోగుల అసోసియేషన్ కార్యవర్గ ఎన్నిక ప్రక్రియ కొనసాగుతోంది. విజయవాడలోని రెవెన్యూ ఉద్యోగుల భవన్​లో ఈ ప్రక్రియను చేపట్టారు. రాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లాలతో పాటు సీసీఎల్​ఏ నుంచి ఉద్యోగులు ఇందులో పాల్గొంటున్నారు. కొవిడ్ నిబంధనల దృష్ట్యా పరిమిత సంఖ్యలోనే హాజరు ఉండేలా చూసుకోవాలని అధికారులు సూచించారు.

ఆ మేరకే... కార్యవర్గ ఎన్నిక ప్రక్రియ నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం కార్యవర్గంలో భాగంగా అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవితో పాటు కార్యదర్శి, సభ్యుల ఎన్నిక కోసం ఒక బృందం మాత్రమే నామినేషన్లను దాఖలు చేసింది. ఈ కారణంగా... రెవెన్యూ ఉద్యోగుల సంఘం అసోసియేషన్ కార్యవర్గం ఎన్నిక ఏకగ్రీవం కానుంది.

ABOUT THE AUTHOR

...view details