ఈ ఏడాది పాలిసెట్ ప్రవేశాలకు గడువును పొడిగిస్తున్నట్లు కన్వీనర్ ఎంఎం నాయక్ ప్రకటించారు. అర్హత సాధించిన వారిలో మూడొంతుల అభ్యర్థులు ఐచ్ఛికాలు ఇవ్వకపోవడంతో.. మరోసారి అవకాశం కల్పించడానికి నిర్ణయించామని తెలిపారు.
పాలిసెట్ ప్రవేశాలకు గడుపు పొడిగింపు - polycet options choosing
కరోనా వల్ల ఇప్పటికే ఆలస్యమైన పాలిసెట్ ప్రవేశాలు మరోసారి వాయిదా పడ్డాయి. అభ్యర్థులు పూర్తిస్థాయిలో ఐచ్ఛికాలను సమర్పించకపోవడంతో.. మరోసారి అవకాశం కల్పించాలని కన్వీనర్ నిర్ణయించారు. సీట్ల ఎంపిక కోసం ఈనెల 22 వరకు గడువు ఇస్తున్నట్లు పేర్కొన్నారు.
ఏపీ పాలిసెట్
ప్రాసెసింగ్ రుసుమును ఈ నెల 21 వరకు చెల్లించవచ్చని నాయక్ వెల్లడించారు. ధ్రువపత్రాల పరిశీలన, సీట్ల ఎంపికకు ఐచ్ఛికాల కోసం ఈ నెల 22 వరుకు గడువు ఇస్తున్నామన్నారు. పాలిసెట్లో 60,780 మంది అర్హత సాధించగా.. 35,346 మంది మాత్రమే ఐచ్ఛికాలు సమర్పించారన్నారు. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అభ్యర్థులకు సూచించారు.
ఇదీ చదవండి:'దెబ్బతిన్న డ్రైనేజీని వెంటనే బాగు చేయాలి'