కర్నూలు జిల్లా నంద్యాలలో అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్యపై నాయకులు రాజకీయాలు చేయొద్దని రాష్ట్ర పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు జనకుల శ్రీనివాస్ కోరారు. శుక్రవారం విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రస్తుతం ఘటనపై ఇద్దరు ఐపీఎస్ అధికారుల ఆధ్వర్యంలో విచారణ జరుగుతుందని ఆయన వెల్లడించారు. ఆ ఘటనలో అరెస్టైన పోలీసులకు విచారణ పూర్తయ్యాక న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నామన్నారు.
మరోవైపు రాజోలు ప్రభుత్వ ఆస్పత్రిలో విధుల్లో ఉన్న వైద్య, పోలీసు సిబ్బందిపై మాజీఎంపీ హర్షకుమార్ దుర్భాషలాడడాన్ని ఖండిస్తున్నామని శ్రీనివాస్ అన్నారు. ప్రభుత్వ అధికారులపై మాజీఎంపీ అనుచిత వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమన్నారు. ప్రభుత్వం ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
సలాం కేసుపై పోలీసు అధికారుల సంఘం కీలక వ్యాఖ్యలు - ap police officers association latest news
కర్నూలు జిల్లా నంద్యాలలో సలాం కుటుంబం ఆత్మహత్య ఘటనలో అరెస్టయిన పోలీసులకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నామని రాష్ట్ర పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు జనకుల శ్రీనివాస్ అన్నారు. తమకు న్యాయస్థానాలు, చట్టాలపై నమ్మకం ఉందన్నారు.
ap Police Officers Association