పోలీసు సిబ్బంది, వారి కుటుంబ సభ్యులకు పోలీస్ ఆరోగ్య భద్రత పథకం ద్వారా కొవిడ్- 19 చికిత్స అందించాలని ఏపీ పోలీసు అధికారులు ప్రతినిధుల సంఘం ప్రభుత్వాన్ని కోరింది. డీజీపి గౌతమ్ సవాంగ్‌కు సంఘం ప్రతినిధులు వినతిపత్రం సమర్పించినట్లు ప్రకటనలో పేర్కొన్నారు.
రెడ్ జోన్ లాంటి ప్రాంతాల్లో సైతం పోలీసులు విధులు నిర్వహిస్తున్నారని సంఘం అధ్యక్షులు జనకుల శ్రీనివాసరావు తెలిపారు. ప్రభుత్వం కొవిడ్ -19 చికిత్సను వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం పరిధిలోకి తెచ్చిందన్నారు. అదే విధంగా ఆరోగ్య భద్రత పథకం పరిధిలోకి కరోనా చికిత్సను తీసుకురావాలని కోరారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో తమకు నగదు రహిత చికిత్స అందించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.