దేవీ నవరాత్రి ఉత్సవాల్లో రాష్ట్రమంతటా ప్రజలు పాల్గొంటున్నారు. కరోనా ధాటికి ఇళ్లు కదలని జనం.. దేవాలయాలకు వెళ్లి భక్తితో అమ్మవారిని కొలుస్తున్నారు. రోజుకో రూపంలో అమ్మవారి దివ్యరూపాన్ని దర్శించి తరిస్తున్నారు. కష్టాల నుంచి గట్టెక్కించాలని ప్రార్థిస్తున్నారు.
కర్నూలులో..
కర్నూలు జిల్లా నంద్యాలలోని కాళికాంబిక ఆలయంలో శ్రీ లలితా త్రిపుర సుందరి దేవిగా అమ్మవారు దర్శనమిచ్చారు. బ్రహ్మానందీశ్వర ఆలయంలో శ్రీ మహాలక్ష్మి దేవిగా, శ్రీ సరస్వతి దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. మహానంది ఆలయంలోని శ్రీ కామేశ్వరీ దేవి అమ్మవారు.. శ్రీ స్కంద మాత దుర్గ అలంకారంలో కనువిందు చేశారు. ఎమ్మిగనూరు పట్టణంలోని వాసవి కన్యకపరమేశ్వరి ఆలయంలో వేంకటేశ్వరస్వామిగా.. సుశీలాంబ ఆలయంలో బాల త్రిపురసుందరదేవిగా అమ్మవారు భక్తులను అనుగ్రహించారు. చిన్న అమ్మవారిశాలలో సరస్వతీ దేవి అలంకరణలో కొలువుతీరారు.
కడపలో..
కడపజిల్లా అమ్మవారిశాలలో వాసవి కన్యకా మాత.. భక్తులకు ఈరోజు మోహినీ అలంకారంలో దర్శనమిచ్చారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. భౌతిక దూరం పాటించేలా సూచిస్తూ.. ఆలయ నిర్వాహకులు కొవిడ్ నిబంధనలు అమలుచేస్తున్నారు. విజయదుర్గా దేవి ఆలయాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించారు.
కృష్ణాలో..