YVB Rajendraprasad: గ్రామీణ ప్రజల సమస్యలు రాష్ట్ర ప్రభుత్వానికి బలంగా తెలిపిన సర్పంచ్ల అరెస్ట్లు దారుణమని ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షులు వైవీబీ రాజేంద్రప్రసాద్ ధ్వజమెత్తారు. భవిష్యత్తులో కూడా ఇదే స్ఫూర్తితో రాష్ట్రంలో ఉన్న12,918 మంది సర్పంచ్లు నిధులు, విధులు, హక్కులు, అధికారాల సాధనకు కృషి చేద్దామని పిలుపునిచ్చారు. ఆర్థిక సంఘం నిధులు రూ.8,700 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పంచాయతీల ఖాతాల్లో జమ చేయటంతో పాటు గ్రామ సర్పంచ్ల గౌరవ వేతనాలను రూ.15000కు పెంచాలని రాజేంద్రప్రసాద్ డిమాండ్ చేశారు. సర్పంచ్ల ద్వారానే గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టే అధికారాలను పునరుద్ధరించాలని, తమ డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించకుంటే ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
సర్పంచ్ల అరెస్ట్ దారుణం: వైవీబీ రాజేంద్రప్రసాద్ - సర్పంచ్ల అరెస్టుపై పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షుడు
YVB Rajendraprasad: గ్రామీణ ప్రజల సమస్యలను ప్రభుత్వానికి ఆందోళనల రూపంలో వ్యక్తపరిచిన సర్పంచ్లను అరెస్టు చేయడం దారుణమని ఏపీ పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షుడు వైవీబీ రాజేంద్రప్రసాద్ ధ్వజమెత్తారు. ఆర్థిక సంఘం నిధులు 8 వేల 700 కోట్లను ప్రభుత్వం వెంటనే పంచాయతీల ఖాతాల్లో జమ చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం సమస్యలు పరిష్కరించకుంటే ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
వైవీబీ రాజేంద్రప్రసాద్