AP Panchayati Raj Chamber letter To Central Minister: రాష్ట్ర ప్రభుత్వం రూ. 7 వేల 660కోట్ల పంచాయతీ నిధులను దొంగిలించిందని ఏపీ పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్ అన్నారు. ఈ మేరకు కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్కు రాజేంద్ర ప్రసాద్ లేఖ రాశారు. రాష్ట్రంలోని 12 వేల 918 గ్రామ పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం పంపిన 14, 15వ ఆర్థిక సంఘం నిధులను సర్పంచులకు ఇవ్వకుండా రాష్ట్ర సర్కార్ దారి మళ్లించిందని లేఖలో పేర్కొన్నారు. ఎలాంటి సమాచారం ఇవ్వకుండా సర్పంచుల సీఎఫ్‌ఎంఎస్ అకౌంట్ల నుంచి డబ్బును కాజేసిందని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వ సొంత పథకాలు, అవసరాలకు వాడేసుకుందని లేఖలో ఆరోపించారు.
'రాష్ట్ర ప్రభుత్వం రూ.7,660 కోట్ల పంచాయతీ నిధులను దొంగిలించింది' - AP Panchayati Raj Chamber President Rajendra Prasad
రూ. 7,660కోట్ల పంచాయతీ నిధులను రాష్ట్ర ప్రభుత్వం దొంగిలించిందని ఏపీ పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్ ఆరోపించారు. కేంద్రం ఇచ్చిన 14, 15వ ఆర్థిక సంఘం నిధులను సర్పంచులకు ఇవ్వకుండా దారి మళ్లించిందని పేర్కొంటూ.. కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్కు లేఖ రాశారు.
!['రాష్ట్ర ప్రభుత్వం రూ.7,660 కోట్ల పంచాయతీ నిధులను దొంగిలించింది' ఏపీ పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-15618840-237-15618840-1655807454062.jpg)
AP Panchayati Raj Chamber President Rajendra Prasad
గ్రామాలలో రోడ్లు, తాగునీరు, అభివృద్ధి కార్యక్రమాలకు వాడాల్సిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం దొంగలించిందన్నారు. ఇది రాజ్యాంగ విరుద్ధమని.. దారుణమైన చర్య అని మండిపడ్డారు. గత 3 ఏళ్లుగా గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు పూర్తిగా నిలిచిపోయాయన్నారు. నిధుల మళ్లింపుపై విచారణ జరిపి, తగిన చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామ పంచాయతీలకు నిధులు తిరిగి ఇప్పించాలని లేఖలో రాజేంద్రప్రసాద్ విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి:రహదారుల మరమ్మతుల వేగవంతానికి సీఎం జగన్ ఆదేశం: మంత్రి సురేశ్