ETV Bharat / city
జయరామ్‌ని ఇలా హత్య చేశారు...! - జయరాం
జయరామ్‌ను ఎలా చంపారో వివరించిన పోలీసులు.
జయరామ్‌ను ఎలా చంపారో వివరించిన పోలీసులు.
By
Published : Feb 5, 2019, 6:26 PM IST
| Updated : Feb 5, 2019, 9:48 PM IST
జయరామ్‌ను ఎలా చంపారో వివరించిన పోలీసులు డబ్బు విషయంలో జనవరి 31న దస్‌పల్లా హోటల్‌లో జయరామ్‌కు రాకేశ్‌రెడ్డి మధ్య గొడవ జరిగిందని పోలీసులు తెలిపారు. రాకేశ్‌రెడ్డి కొట్టడంతో జయరాం సోఫాలో పడ్డారని వెల్లడించారు. తలపై బలంగా ఒత్తి పట్టడంతో చనిపోయాడని నిర్ధరించారు. జయరాం ముందుగా విజయవాడ వెళ్లాలని అనుకున్నారని...అది తెలిసిన రాకేశ్‌రెడ్డి దస్‌పల్లా హోటల్ నుంచే పథకం పన్నాడని తెలిపారు. ఈ కేసులో ఇద్దరు తెలంగాణ పోలీసులు సహకరించినట్లు రాకేశ్ చెప్పాడని పేర్కొన్నారు. ఈ కేసులో శ్రిఖా చౌదరి ప్రమేయం లేదని కృష్ణా ఎస్పీ స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా తన భర్త హత్యకేసులో శ్రిఖా పాత్ర ఉందని భార్య పద్మశ్రీ అనుమానం వ్యక్తం చేసింది. జూబ్లీహిల్స్ పీఎస్ లో ఫిర్యాదు చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం. Last Updated : Feb 5, 2019, 9:48 PM IST