గుంటూరు జిల్లా తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఏపీఎన్‌జీవో సంఘాల నేతలు ముఖ్యమంత్రి జగన్‌ను కలిశారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వెంటనే పీఆర్సీ ఇవ్వాలని ఉద్యోగ సంఘాలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను కోరాయి. పీఆర్సీ నివేదిక రాష్ట్ర ప్రభుత్వానికి చేరి చాలా రోజులైందని ఏపీఎన్‌జీవోల సంఘం ప్రతినిధులు సీఎంకు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం అక్కడి ఉద్యోగులకు ఇప్పటికే పీఆర్సీ ఇచ్చిందని.. ఇప్పటికైనా జాప్యం లేకుండా పీఆర్సీ ఇవ్వాలని కోరినట్లు ఎపీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు తెలిపారు.
AP NGO's: సీఎం జగన్‌ను కలిసిన ఎన్‌జీవోల సంఘం ప్రతినిధులు - cm jagan news
15:51 September 15
AP NGO's leaders met cm jagan
ఉద్యోగ సంఘాల నేతలతో చర్చించి త్వరలోనే పీఆర్సీ ప్రకటిస్తామని సీఎం హామీ ఇచ్చినట్లు తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇబ్బందిగా ఉందని, ముందు పీఆర్సీ ఇచ్చి.. తర్వాత డీఏలు ఇస్తామని సీఎం చెప్పినట్లు పేర్కొన్నారు. సీపీఎస్ రద్దుపై ఇచ్చిన హామీ నిలబెట్టుకుంటామని సీఎం జగన్ హామీ ఇచ్చారన్నారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు శాఖాపరమైన పరీక్షలతో సంబంధం లేకుండా ప్రొబేషన్ డిక్లర్ చేయాలని కోరినట్లు ఏపీఎన్‌జీవో ప్రతినిధి బండి శ్రీనివాసరావు తెలిపారు. ఉద్యోగుల సమస్యల పట్ల ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారని నేతలు తెలిపారు.
ఇదీ చదవండి:
Fee: ఫీజు నియంత్రణ జీవోలపై హైకోర్టులో విచారణ.. తీర్పు రిజర్వు