విజయవాడ కనకదుర్గ అమ్మవారిని పలువురు కొత్త మంత్రులు దర్శించుకున్నారు. మంత్రులుగా ప్రమాణం చేసిన రోజా, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నారాయణస్వామి, బుగ్గన రాజేంద్ర నాథ్, కారుమూరి నాగేశ్వరరావు, బూడి ముత్యాలనాయుడు దుర్గమ్మ సేవలో పాల్గొన్నారు. వీరి తర్వాత దేవదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ సైతం అమ్మవారిని దర్శించుకున్నారు. నూతన మంత్రులకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన ఈవో.. దర్శన ఏర్పాట్లు చేశారు. ఆ తర్వాత అమ్మవారి చిత్రపటం, ప్రసాదం అందజేశారు. వేద పండితులు ఆశీర్వచనాలు అందించారు.
బెజవాడ దుర్గమ్మ సేవలో కొత్త మంత్రులు - AP New ministers visit indrakeeladri latest news
నూతనంగా ప్రమాణస్వీకారం చేసిన పలువురు మంత్రులు.. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. కొత్త మంత్రులకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన ఈవో.. దర్శన ఏర్పాట్లు చేశారు.
బెజవాడ దుర్గమ్మ సేవలో కొత్త మంత్రులు