ఏపీ మునిసిపల్ వర్కర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో విజయవాడలో కార్మికులు ఆందోళనకు దిగారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలపై దాడులు పెరిగిపోయాయని.. దాడులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
'దాడులు చేసే వారిపై చర్యలు తీసుకోవాలి' - AP Municipal Workers Federation protest in vijayawada
రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలపై దాడులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఏపీ మునిసిపల్ వర్కర్స్ ఫెడరేషన్ కార్మికులు నిరసన చేపట్టారు.
!['దాడులు చేసే వారిపై చర్యలు తీసుకోవాలి' AP Municipal Workers Federation protest in vijayawada](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8206513-367-8206513-1595939574798.jpg)
సామాజిక వర్గాలపై దాడులు చేసే వారి పై చర్యలు తీసుకోవాలి
వెనుకబడిన వర్గాల ఓట్లతోనే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చారని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి ఉమామహేశ్వరరావు అన్నారు. అక్రమ ఇసుక రవాణా అడ్డుకున్నందుకు సీతానగరంలో ఎస్సీ యువకుడికి పోలీసులే గుండు గీయించడం అత్యంత హేయమైన చర్యని అన్నారు. ప్రకాశం జిల్లా చీరాలలో మాస్కు ధరించలేదని యువకుడికిపై పోలీసులే దాడికి పాల్పడి మృతికి కారణమయ్యారని మండిపడ్డారు. చనిపోయిన వారి కుటుంబాని రూ. 25 లక్షల పరిహారం ప్రకటించాలని ఏపీ మునిసిపల్ వర్కర్స్ ఫెడరేషన్ డిమాండ్ చేస్తుందన్నారు.