ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'ఉక్రెయిన్ నుంచి వచ్చిన విద్యార్థుల.. చదువులకు ఆటంకాలు లేకుండా చూడాలి' - తెలుగు విద్యార్థుల వైద్య విద్యపై ఏపీ ఎంపీలు

ఉక్రెయిన్‌ యుద్ధ భయాల మధ్య అక్కడి నుంచి తిరిగొచ్చిన దేశ వైద్య విద్యార్థులకు.. ఇక్కడే తాత్కాలికంగా చదువును కొనసాగించే అవకాశం కల్పించాలని రాష్ట్ర ఎంపీలు కేంద్రాన్ని కోరారు. కేంద్రం దీనిపై మానవతా దృక్పథంతో వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు.

విజయసాయిరెడ్డి, వైకాపా ఎంపీ
విజయసాయిరెడ్డి, వైకాపా ఎంపీ

By

Published : Mar 14, 2022, 4:04 PM IST

ఉక్రెయిన్‌ యుద్ధ భయాల మధ్య అక్కడి నుంచి తిరిగొచ్చిన దేశ వైద్య విద్యార్థులకు.. ఇక్కడే తాత్కాలికంగా చదువును కొనసాగించే అవకాశం కల్పించాలని వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. దేశంలో ఏదైనా కళాశాలలు మూసివేతకు గురైతే విద్యార్థులకు ప్రత్యామ్నాయంగా ఇతర సంస్థల్లో ఎలా అవకాశం కల్పిస్తారో ఇక్కడా అలానే చేయాలన్నారు. కేంద్రం దీనిపై మానవత్వ దృక్పథంతో వ్యవహరించాలని కోరారు.

"ఉక్రెయిన్‌లో యుద్ధ పరిస్థితులు ఇప్పట్లో సద్దుణిగేలా లేవు. ఇలాంటి పరిస్థితుల్లో దేశ విద్యార్థులు మళ్లీ ఉక్రెయిన్‌ వేళ్లలేరు. ఉద్రిక్తతల వేళ వైద్య విద్యను కొనసాగించే అవకాశం లేదు. దీనిని మానవతా దృక్పథంతో ప్రత్యేకంగా పరిగణించాలి. చదువుతున్న కళాశాలలు మూతపడితే ప్రత్యామ్నాయం చూస్తారు. ఉక్రెయిన్‌ నుంచి వచ్చిన వారికీ ఇదే విధానాన్ని అమలు చేయాలి. పరిస్థితులు పూర్వ స్థితికి వచ్చే వరకు దీనిని కొనసాగించాలి. విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా కేంద్రం చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి." -విజయసాయిరెడ్డి, వైకాపా ఎంపీ

ఆటంకాలు కలగకుండా చూడాలి: కనకమేడల
ఉక్రెయిన్ నుంచి వచ్చిన తెలుగు విద్యార్థుల వైద్య విద్యకు ఆటంకాలు కలగకుండా చూడాలని తెదేపా ఎంపీ కనకమేడల కేంద్రాన్ని కోరారు. రాజ్యసభ జీరో అవర్‌లో ఈ అంశంపై ప్రస్తావించిన ఎంపీ కనకమేడల.. చదువు మధ్యలోనే వదిలి విద్యార్థులు స్వదేశానికి తిరిగొచ్చారన్నారు. విద్యార్థుల వైద్య విద్యకు ఆటంకాలు కలగకుండా చూడాలన్నారు. చదువులు కొనసాగేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. విద్యార్థుల భవిష్యత్తుకు ఇబ్బంది లేకుండా కేంద్రం చర్యలు తీసుకోవాలని కోరారు. ఇండియన్ మెడికల్ కౌన్సిల్ సహా భాగస్వాములైన అందరితో చర్చించాలన్నారు.

"తెలుగు విద్యార్థులు ఉక్రెయిన్‌లో వైద్య విద్య అభ్యసిస్తున్నారు. చదువు మధ్యలోనే వదిలి స్వదేశానికి తిరిగొచ్చారు. విద్యార్థుల వైద్య విద్యకు ఆటంకాలు కలగకుండా చూడాలి. చదువులు కొనసాగేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. విద్యార్థుల భవిష్యత్తుకు ఇబ్బంది లేకుండా కేంద్రం చర్యలు తీసుకోవాలి. ఇండియన్ మెడికల్ కౌన్సిల్ సహా భాగస్వాములైన అందరితో చర్చించాలి." -కనకమేడల రవీంద్ర కుమార్, తెదేపా ఎంపీ

ఇదీ చదవండి

వారు ప్రత్యామ్నాయ పార్టీ పెడితే.. మద్దతిస్తా: "బ్రదర్" అనిల్‌

ABOUT THE AUTHOR

...view details