ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'త్వరలోనే కన్నా భూ కబ్జా వ్యవహారం బయటపెడతా' - కన్నా నిరసన దీక్షపై మంత్రి వెల్లంపల్లి ఆగ్రహం

కరోనా సంక్షోభంలో ఉన్నా అందరినీ ఆదుకునేలా సీఎం జగన్​ చర్యలు చేపడుతున్నారని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్​ అన్నారు. తితిదే భూముల వేలం విషయంలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ నిరసన దీక్ష చేపట్టడాన్ని ఆయన తప్పుబట్టారు. ఇది గత ప్రభుత్వ హయాంలో తీసుకున్న నిర్ణయమని స్పష్టం చేశారు. త్వరలోనే కన్నా భూ కబ్జాలను బయటపెడతానని హెచ్చరించారు.

'త్వరలోనే కన్నా భూ కబ్జా వ్యవహారం బయటపెడతా'
'త్వరలోనే కన్నా భూ కబ్జా వ్యవహారం బయటపెడతా'

By

Published : May 26, 2020, 8:10 PM IST

Updated : May 26, 2020, 9:57 PM IST

భాజపా రాష్ట్ర అధ్యక్షునిపై మంత్రి వెల్లంపల్లి విమర్శలు

ప్రభుత్వాన్ని కించపరచాలని చూస్తే ఊరుకోబోమని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్​ స్పష్టం చేశారు. తితిదే భూములు వేలం వేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని నిరసిస్తూ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ నిరాహార దీక్ష చేయడంపై మంత్రి మండిపడ్డారు. నూజివీడులో 18 ఎకరాల వెంకటాచలం భూములను కన్నా కబ్జా చేశారని.. త్వరలోనే దీన్ని బయటపెడతానని వెల్లడించారు.

తితిదే ఆస్తుల విక్రయంపై గత ప్రభుత్వ హయాంలోని దేవస్థానం పాలక మండలి నిర్ణయం తీసుకుందని మంత్రి స్పష్టం చేశారు. గత పాలకమండలి తీసుకున్న నిర్ణయాన్ని రద్దు చేసినందుకు కన్నా దీక్ష చేస్తున్నారా అని మంత్రి ప్రశ్నించారు. ఆ పార్టీ తప్పుడు నిర్ణయాన్ని తమకు అంటకట్టవద్దని మంత్రి వెల్లంపల్లి కోరారు.

Last Updated : May 26, 2020, 9:57 PM IST

ABOUT THE AUTHOR

...view details