తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పంతో యాదాద్రి ఆలయం(YADADRI TEMPLE) అద్భుతంగా నిర్మాణం జరుగుతోందని రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని నాని(PERNI NANI) పేర్కొన్నారు. శ్రీలక్ష్మి నరసింహస్వామివారిని సతీసమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. పేర్ని నానికి ఆలయ అర్చకులు ప్రత్యేక స్వాగతం పలికారు. స్వామివారి దర్శనం అనంతరం.. ఆలయ పునర్నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు.
అద్భుతంగా పునర్నిర్మాణం
తెలంగాణ సీఎం కేసీఆర్(CM KCR) ఆదేశాలతో యాదాద్రి ఆలయ నిర్మాణం అద్భుతంగా జరుగుతోందన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ చిత్తశుద్ధితో ఈ నిర్మాణం చేస్తున్నట్లు అనిపిస్తోందని అభిప్రాయపడ్డారు. ఏపీలో తిరుమల(TIRUMALA) ఆలయాన్ని శ్రీకృష్ణదేవరాయలు నిర్మించి... చరిత్రలో నిలిచారని గుర్తు చేశారు. అదేవిధంగా యాదాద్రి ఆలయాన్ని సీఎం కేసీఆర్ హయాంలో పునర్ నిర్మించి.. చరిత్రలో నిలుస్తారని అన్నారు. గొప్ప సంకల్పతో ఈ పుణ్యక్షేత్రాన్ని సీఎం కేసీఆర్ నిర్మించడం స్వామివారి ఆశీస్సుల వల్లేనని అన్నారు.
సీఎం కేసీఆర్ గొప్ప సంకల్పంతో యాదాద్రి ఆలయం గొప్పగా రూపుదిద్దుకుంటోంది. ఈ ఆలయం గురించి విన్నదాన్ని నేడు కళ్లతో చూశాం. కేసీఆర్ చిత్తశుద్ధితో ఈ ఆలయాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారు. వెంకన్న ఆలయాన్ని శ్రీకృష్ణదేవరాయలు నిర్మించి.. చరిత్రలో నిలిచారు. యాదాద్రి పునర్నిర్మాణంతో భవిష్యత్ చరిత్రలో సీఎం కేసీఆర్ ఉంటారు. స్వామి సేవలో కేసీఆర్ తరించడం, ఈ ఆలయాన్ని ఇంత గొప్పగా సృష్టించడం స్వామివారి ఆశీస్సులతోనే జరుగుతోంది. ఈ ఆలయాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారు. -పేర్ని నాని, ఆంధ్రప్రదేశ్ మంత్రి