ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

జీఎస్టీ బకాయిలను కేంద్రం త్వరితగతిన చెల్లించాలి: బుగ్గన - ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వార్తలు

జీఎస్టీ బకాయిలను కేంద్రం త్వరితగతిన చెల్లించాలని.. ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి డిమాండ్‌ చేశారు. విజయవాడ నుంచి దృశ్యమాధ్యమం ద్వారా.. దిల్లీలో జరిగిన జీఎస్​టీ కౌన్సిల్‌ సమావేశంలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పాల్గొన్నారు.

ap minister buggana
ap minister buggana

By

Published : Oct 13, 2020, 10:13 AM IST

విజయవాడ నుంచి దృశ్యమాధ్యమం ద్వారా.. దిల్లీలో జరిగిన జీఎస్​టీ కౌన్సిల్‌ సమావేశంలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం వసూలు చేస్తున్న సెస్‌లు, సర్‌ ఛార్జీలకు సంబంధించి పంపకాల సర్దుబాటు లేనందున రాష్ట్రాల ఆదాయం తగ్గుతోందని.. ఆర్దికమంత్రి అభిప్రాయం వ్యక్తం చేశారు. కొవిడ్‌ కారణంగా ప్రజారోగ్యంపై ఎక్కువ మొత్తాలను వెచ్చిస్తున్న కారణంగా రాష్ట్ర వనరులపై భారం ఎక్కువైందని వివరించారు. ప్రాముఖ్యత ఉన్న అంశాలకు అంగీకారం తెలియచేస్తూ సరైన విధాన రూపకల్పన చేయాలని సూచించారు. పరిహారం విషయంలో ఏకాభిప్రాయం కోసం మరిన్ని సమావేశాలు నిర్వహించటంతో పాటు అధ్యయనం చేయాల్సి ఉందని స్పష్టం చేశారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details