రాష్ట్రవ్యాప్తంగా 1,317 పారామెడికల్, నాలుగో తరగతి ఉద్యోగాల భర్తీకి ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ నోటిఫికేషన్(ap health department latest news) విడుదల చేసింది. వీటిలో 839 ఎఫ్‌ఎన్‌వో (ఫీమేల్ నర్సింగ్ ఆర్డర్లీ), 312 పారిశుద్ధ్య సహాయకులు, వాచ్‌మెన్, 17 గ్రేడ్-2 ఫార్మసిస్టు, 124 గ్రేడ్-2 ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులున్నాయి. ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మసిస్టు పోస్టుల్ని ఒప్పంద, ఎఫ్‌ఎన్‌వో, పారిశుద్ధ్య సహాయకుడు పోస్టుల్ని ఔట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చేస్తారు.
ఈ పోస్టులన్నీ ప్రజారోగ్య శాఖ పరిధిలో పనిచేసే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఉన్నాయి. నియామకాల ప్రక్రియను డిసెంబరు 28లోగా పూర్తిచేయాలని(ap Health Department latest recruitment) ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ భాస్కర్ కాటంనేని ఆదేశించారు. పీహెచ్‌సీల్లో 264 వైద్యుల (సివిల్ అసిస్టెంట్ సర్జన్) పోస్టుల భర్తీకి రాష్ట్రస్థాయిలో మంగళవారం నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు.