కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తానన్న సీఎం జగన్ హామీని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ.. ఏపీ వైద్య ఆరోగ్య శాఖ ఒప్పంద సిబ్బంది.. నిరాహార దీక్షకు దిగారు. రాష్ట్ర వ్యాప్త కాంట్రాక్టు ఉద్యోగుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో.. విజయవాడ ధర్నాచౌక్ వద్ద ఆందోళన నిర్వహించారు.
సీఎం కాకముందు చేసిన ప్రజా సంకల్ప యాత్రలో.. జగన్ మాటిచ్చారని గుర్తు చేశారు. అర్హత కలిగిన హెల్త్ అసిస్టెంట్, ల్యాబ్ టెక్నీషియన్, ఏఎన్ఎం, స్టాఫ్ నర్స్‌లను తక్షణమే క్రమబద్దీకరించాలని నినాదాలు చేశారు. 20 ఏళ్లుగా పని చేస్తూ.. వయసు మీద పడిన 60 శాతం మందికి పదవీ విరమణానంతర సౌకర్యాలు కల్పించాలన్నారు.