ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'ఇంటర్​ బోర్డు కార్యదర్శి వైఖరి మార్చుకోవాలి.. లేదంటే ఆందోళన ఉద్ధృతం' - ఇంటర్మీడియట్‌ బోర్డు ఎదుట ఏపీ జేఎంఏ ధర్నా

ఇంటర్మీడియట్‌ బోర్డు కార్యదర్శి వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు అఫిలియేడెట్‌ ప్రైవేటు జూనియర్‌ కళాశాలల యాజమాన్య సంఘం పేర్కొంది. ఈ మేరకు విజయవాడలోని బోర్డు ప్రధాన కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టింది.

ap jma protest at vijayawada
ఏపీ జేఎంఏ ధర్నా

By

Published : Mar 30, 2021, 8:40 PM IST

ఇంటర్ బోర్డు ప్రధాన కార్యాలయం వద్ద ఏపీజేఎంసీ ఆందోళన

కళాశాలలతో ప్రమేయం లేకుండా, ప్రిన్సిపల్‌ సంతకం చేయకుండానే విద్యార్థులు నేరుగా ఆన్‌లైన్‌లో హాల్‌టిక్కెట్లు డౌన్‌లోడ్‌ చేసుకునే సదుపాయం కల్పించడాన్ని అఫిలియేటెడ్‌ ప్రైవేటు జూనియర్‌ కళాశాలల యాజమాన్య సంఘం తీవ్రంగా తప్పుపట్టింది. ఇంటర్మీడియట్‌ బోర్డు కార్యదర్శి వైఖరిని ఖండిస్తూ విజయవాడలోని బోర్డు ప్రధాన కార్యాలయం ఎదుట సంఘం ప్రతినిధులు ఆందోళన చేశారు. ప్రతి ప్రైవేటు కళాశాల నుంచి వివిధ రకాల ఫీజులు రూపంలో బలవంతంగా డబ్బులు వసూలు చేసిన బోర్డు.. తమతో విద్యార్ధులకు ప్రమేయం లేనిరీతిలో నిర్ణయాలు తీసుకోవడాన్ని ఆక్షేపించారు.

ఇప్పటికైనా బోర్డు కార్యదర్శి తన నిర్ణయాలు మార్చుకోవాలని.. లేకుంటే తీవ్రస్థాయిలో ఆందోళనలు చేస్తామని స్పష్టం చేశారు. కరోనా వ్యాప్తిని పరిగణనలోకి తీసుకోకుండా బోర్డు వ్యవహరిస్తోందని ఆరోపించారు. బుధవారం నుంచి జరిగే ప్రాక్టికల్స్‌ పరీక్షలను జంబ్లింగ్‌ పద్ధతిలో కాకుండా సాధారణంగా నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. 2021-22 విద్యా సంవత్సరానికి ఆన్‌లైన్‌ ప్రవేశాలపై విస్తృతంగా ప్రచారం కల్పించాలని కోరారు. నూతన విద్యా నిబంధనను ఖచ్చితంగా అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు.

ABOUT THE AUTHOR

...view details