సాంకేతిక పరిజ్ఞానంతో సుపరిపాలన అందించే ప్రక్రియలో అమెజాన్ సంస్థ కూడా భాగస్వామి కావాలని రాష్ట్ర పరిశ్రమలు,ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఏపీ ప్రభుత్వానికి అమెజాన్ వెబ్ సర్వీసులు అందించేందుకు ఉన్న అవకాశాలపై మంత్రి ఆ సంస్థ ప్రతినిధులతో వీడియో సమావేశంలో మాట్లాడారు.
AMAZON : అమెజాన్ కూడా భాగస్వామి కావాలి -ఐటీ మంత్రి మేకపాటి గౌతమ్ - ఐ.టీ శాఖలో స్టార్టప్ లు
సాంకేతిక పరిజ్ఞానంతో సుపరిపాలన అందించే ప్రక్రియలో అమెజాన్ సంస్థ కూడా భాగస్వామి కావాలని రాష్ట్ర పరిశ్రమలు,ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఏపీ ప్రభుత్వానికి అమెజాన్ వెబ్ సర్వీసులు అందించేందుకు ఉన్న అవకాశాలపై మంత్రి ఆ సంస్థ ప్రతినిధులతో వీడియో సమావేశంలో మాట్లాడారు.
సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, డేటా సెంటర్ ఏర్పాటు వంటి అంశాలపై చర్చించారు. టెక్నాలజీ ఆధారిత సేవలకు సంబంధించి అమెజాన్ ప్రతిపాదనలు తీసుకువస్తే ప్రభుత్వ పరంగా పరిశీలిస్తామని మంత్రి వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ లో అమెజాన్ క్యాంపస్ ఏర్పాటుకు ముందుకు రావాలని మంత్రి మేకపాటి కోరారు. పరిశ్రమల శాఖలో డిజిటల్ ట్రాన్స్ ఫర్మేషన్, ఐ.టీ శాఖలో స్టార్టప్ లు, క్లౌడ్ టెక్నాలజీ అంశాలపైనా చర్చించారు. ఏపీలో చీఫ్ మినిస్టర్ ఇన్నొవేషన్ ఛాలెంజ్, ఆంధ్రప్రదేశ్ సిటిజెన్ 360 స్టార్టప్ ల ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నామన్నారు. ఐటీ శాఖ ద్వారా రాష్ట్ర ప్రభుత్వంలోని అన్ని శాఖల్లో క్లౌడ్ ద్వారా సేవలందించేందుకు సిద్ధమవుతున్నట్టు మంత్రి వెల్లడించారు.
ఇదీ చదవండి : CM Jagan: 'గంజాయి సాగుపై ఉక్కుపాదం'