కృష్ణా, గోదావరి ప్రాజెక్టులపై కేంద్రం జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్‌పై కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్(ap integrated development study forum letter to minister Gajendra Shekawath)కు ఏపీ సమగ్రాభివృద్ధి అధ్యయన వేదిక లేఖ(ap integrated development study forum) రాసింది. గోదావరి నదీ యాజమాన్య బోర్డు తెలంగాణాలో, కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ఏపీలో పెట్టాలని ఏపీ పునర్విభజన చట్టం స్పష్టం చేస్తోందని.. విభజన జరిగి ఇన్నాళ్లైనా ఇది అమలుకు నోచుకోలేదని లేఖలో పేర్కొంది. కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే బోర్డులు ఇప్పటికీ హైదరాబాద్ నుంచే పని చేస్తున్నాయని తెలిపింది. అలాగే కృష్ణా నదీ పరీవాహక ప్రాంతం, బేసిన్ లేకుండా.. కృష్ణా నదీ యాజమాన్య బోర్డును విశాఖలో పెట్టడం సహేతుకం కాదని వెల్లడించింది. కృష్ణా బేసిన్ పరిధిలోని కర్నూలులో కృష్ణా బోర్డు(KRMB) ఏర్పాటు చేస్తే అన్నివిధాలా అనుకూలమని స్పష్టం చేసింది.
అక్టోబరు 14 నుంచి అమల్లోకి రానున్న నోటిఫికేషన్‌ను ఆరేళ్లు ఆలస్యంగా ఇవ్వడంపై రెండు రాష్ట్రాల మధ్య నీటి వివాదాలు తీవ్రస్థాయికి చేరాయన్నారు. తెలంగాణ.. ఏకపక్షంగా విద్యుత్ ఉత్పత్తికి నీటి వాడకం, నీటి వివాదాల గురించి రెండు రాష్ట్రాలూ ప్రాజెక్టులపై పరస్పరం పోలీసులను మోహరించుకున్న పరిస్థితులకు దారీ తీశాయని స్పష్టం చేసింది. ఈ దశలో కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్ స్వాగతించదగినదేనని ఏపీ సమగ్రాభివృద్ధి అధ్యయన వేదిక కన్వీనర్ టి. లక్ష్మీనారాయణ(forum convener lakshminarayana) పేర్కోన్నారు. అక్షర దోషాల వల్ల తప్పుగా నమోదైన వెలుగొండ ప్రాజెక్టును సవరించాలని అభ్యర్థిస్తే.. అది అక్రమ ప్రాజెక్టుని తెలంగాణ లేఖలు రాసింది.. దీన్ని కేంద్రం అంగీకరిస్తే కల్వకుర్తి, నెట్టెంపాడు ప్రాజెక్టులను కూడా ఆపాల్సిందేనని ఆయన పేర్కొన్నారు.