ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

APIIC: తెలంగాణలో ఇండస్ట్రియల్​ పార్కును సందర్శించిన ఏపీ ఐఐసీ బృందం - తెలంగాణలో ఇండస్ట్రియల్​ పార్కును సందర్శించిన ఏపీ ఐఐసీ బృందం న్యూస్

ఏపీ ఐఐసీ ప్రతినిధి బృందం తెలంగాణలోని దండు మల్కాపూర్ టీఐఎఫ్ గ్రీన్ ఎంఎస్ఎంఈ మోడల్ ఇండస్ట్రియల్ పార్కును సందర్శించారు. పార్కులో అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన మాస్టర్ ప్లాన్​ను టీఎస్ ఐఐసీ ఛైర్మన్ ఏపీ ప్రతినిధులకు వివరించారు.

ఇండస్ట్రియల్​ పార్కును సందర్శించిన ఏపీ ఐఐసీ బృందం
ఇండస్ట్రియల్​ పార్కును సందర్శించిన ఏపీ ఐఐసీ బృందం

By

Published : Nov 5, 2021, 6:43 PM IST

Updated : Nov 5, 2021, 7:51 PM IST

తిరుపతి ఎంపీ గురుమూర్తి ఆధ్వర్యంలోని ఏపీ ఐఐసీ ప్రతినిధి బృందం తెలంగాణలోని దండు మల్కాపూర్ టీఐఎఫ్ గ్రీన్ ఎంఎస్ఎంఈ మోడల్ ఇండస్ట్రియల్ పార్కును సందర్శించారు. స్టడీ టూర్​కు వెళ్లిన ఏపీ బృందానికి టీఎస్ ఐఐసీ ఛైర్మన్ గ్యాదరి బాలమల్లు, టీఐఎఫ్ అధ్యక్షుడు సుధీర్ రెడ్డి స్వాగతం పలికారు. అనంతరం ఇండస్ట్రియల్ పార్కులో నెలకొల్పిన లే ఔట్, ప్లాటింగ్, రోడ్స్, డ్రైనేజీ, రెయిన్ వాటర్ డ్రైనేజీ సిస్టం, కామన్ ఫెసిలిటీ సెంటర్, ఇండస్ట్రియల్ ట్రైనింగ్ సెంటర్ నిర్మాణం, రోడ్స్ గ్రీనరీ, ప్లాంటింగ్, ఇతర మౌలిక సదుపాయాలను పరిశీలించారు.

పార్కులో అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన మాస్టర్ ప్లాన్​ను టీఎస్ ఐఐసీ ఛైర్మన్ ఏపీ ప్రతినిధులకు వివరించారు. భవిష్యత్తులో ఇక్కడే మరో 1200 ఎకరాలలో ఇండస్ట్రియల్ పార్కును అభివృద్ధి చేయనున్నట్లు వెల్లడించారు. అందుకు సంబంధించిన రోడ్ మ్యాప్​ను ఏపీ బృందానికి వివరించారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల కోసం 400 ఎకరాలల్లో మోడల్ ఇండస్ట్రీయల్ పార్కును అత్యాధునిక మౌలిక వసతులతో నెలకొల్పమన్నారు. ఏపీ ప్రతినిధుల బృందంలో ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రీయల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్(ఏపీ ఐఐసి) ఛైర్మన్ మెట్టు గోవింద్ రెడ్డి, ఎండీ బాలసుబ్రహ్మణ్యం, ఏపీ టూరిజం కార్పొరేషన్ ఛైర్మన్, ఇతర అధికారులు ఉన్నారు.

ఇదీ చదవండి: CBN Letter To SEC:'కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో అక్రమాలు'..ఎస్​ఈసీకి చంద్రబాబు లేఖ

Last Updated : Nov 5, 2021, 7:51 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details