ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

అక్కడ వైకాపా కార్యాలయం కట్టినట్లు తేలితే.. కూల్చివేత ఉత్తర్వులు: హైకోర్టు - అక్కడ కార్యాలయం కట్టినట్లు తేలితే కూల్చివేత ఉత్తర్వులు

కాకినాడ పీజీ సెంటర్‌ స్థలంలో వైకాపా కార్యాలయం ఏర్పాటుపై హైకోర్టులో విచారణ జరిగింది. ప్రభుత్వ భూమిలో వైకాపా కార్యాలయం కట్టినట్లు తేలితే కూల్చివేత ఉత్తర్వులు ఇస్తామని హైకోర్టు స్పష్టం చేసింది.

అక్కడ వైకాపా కార్యాలయం కట్టినట్లు తేలితే కూల్చివేత ఉత్తర్వులు
అక్కడ వైకాపా కార్యాలయం కట్టినట్లు తేలితే కూల్చివేత ఉత్తర్వులు

By

Published : Apr 18, 2022, 10:18 PM IST

Updated : Apr 19, 2022, 3:36 AM IST

కాకినాడ గ్రామీణ మండలం తిమ్మాపురం గ్రామ సర్వే నంబరు 110, 113లోని ఎం.ఎస్‌.నాయకర్‌ పీజీ కేంద్రానికి చెందిన 4.41 ఎకరాల భూమిలో వైకాపా కార్యాలయం ఏర్పాటు వ్యవహారం తామిచ్చే తుది తీర్పునకు లోబడి ఉంటుందని హైకోర్టు స్పష్టం చేసింది. అది ప్రభుత్వ స్థలమని తేలితే అక్కడ నిర్మించబోయే కార్యాలయం కూల్చివేతకు ఆదేశాలిస్తామని వ్యాఖ్యానించింది. వైకాపా కార్యాలయం ఏర్పాటుకు చెట్లు కొట్టేస్తున్నారని, నిలువరించాలని పిటిషనర్‌ తరఫు న్యాయవాది కేఎస్‌ మూర్తి అభ్యర్థించారు. ప్రస్తుతం మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమన్న ధర్మాసనం.. అక్కడ కార్యాలయం ఏర్పాటు చేస్తే ఈ వ్యాజ్యంలో తమ తుది తీర్పునకు లోబడి దాని వ్యవహారం ఉంటుందని స్పష్టంచేసింది. రెవెన్యూశాఖ ముఖ్యకార్యదర్శి, కాకినాడ జిల్లా కలెక్టర్‌, తిమ్మాపురం గ్రామ పంచాయతీ కార్యదర్శి, ఎం.ఎస్‌.నాయకర్‌ పీజీ కేంద్రం ప్రిన్సిపల్‌, వైకాపా ప్రధాన కార్యదర్శికి నోటీసులు జారీచేసింది. విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్ర, జస్టిస్‌ ఎం.సత్యనారాయణమూర్తితో కూడిన ధర్మాసనం సోమవారం ఈ మేరకు ఆదేశాలిచ్చింది.

పీజీ కేంద్రం నియంత్రణలో ఉన్న భూమిలో వైకాపా పార్టీ కార్యాలయం ఏర్పాటును అడ్డుకోవాలంటూ తిమ్మాపురానికి చెందిన బి.గణేష్‌ హైకోర్టులో పిల్‌ వేశారు. ఆ భూమి వినియోగం కోసం పూర్వ తూర్పుగోదావరి జిల్లా (ప్రస్తుతం కాకినాడ జిల్లా) కలెక్టర్‌ మార్చి 22న ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలని కోరారు. రెవెన్యూ రికార్డుల ప్రకారం ఆ భూమి ‘బండి బాట’గా ఉందని, దానిలో ఎలాంటి భవనాలు నిర్మించడానికి వీల్లేదన్నారు.

ఇదీ చదవండి:"వారికి వెంటనే జీతాలు చెల్లించండి".. ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

Last Updated : Apr 19, 2022, 3:36 AM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details