ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Wind Solar Power Pending Bills: ఈనెల 29లోగా వాటి బకాయిలు చెల్లించాలి: హైకోర్టు - ఏపీ హైకోర్టు న్యూస్

Wind Solar Power Pending Bills: సౌర, పవన విద్యుత్‌ సంస్థలకు బకాయిల చెల్లింపుపై హైకోర్టులో విచారణ జరిగింది. ఇప్పటి వరకు రూ. 700 కోట్లు చెల్లించామన్న విద్యుత్ పంపిణీ సంస్థలు..జూన్ నెల బకాయిలు చెల్లించాల్సి ఉందని న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చాయి. వాటి చెల్లింపునకు గడువు కోరగా అందుకు ధర్మాసనం నిరాకరించింది.

హైకోర్టు
హైకోర్టు

By

Published : Dec 8, 2021, 8:22 PM IST

HC On Wind Solar Power Pending Bills: సౌర, పవన విద్యుత్‌ సంస్థలకు బకాయిల చెల్లింపుపై హైకోర్టులో ఇవాళ విచారణ జరిపింది. కోర్టు అదేశాల మేరకు రూ. 700 కోట్లు చెల్లించామని విద్యుత్ పంపిణీ సంస్థలు న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చాయి. జూన్ నెల బకాయిలు చెల్లించాల్సి ఉందన్న పంపిణీ సంస్థలు..జనవరి 15 వరకు గడువు పెంచాలని న్యాయస్థానాన్ని కోరాయి. అందుకు ధర్మాసనం నిరాకరించింది. ఈనెల 29 లోపు జూన్ నెల బకాయిలు కూడా చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. అనంతరం తదుపరి విచారణను డిసెంబరు 29కి వాయిదా వేసింది.

ABOUT THE AUTHOR

...view details