ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

"వారికి వెంటనే జీతాలు చెల్లించండి".. ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం - ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

ఎయిడెడ్ ఉపాధ్యాయులకు వెంటనే జీతాలు చెల్లించాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ప్రభుత్వం 8 నెలలుగా జీతాలు ఇవ్వటం లేదని ఉపాధ్యాయులు న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేయగా ఈ మేరకు హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులిచ్చింది.

ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

By

Published : Apr 18, 2022, 7:44 PM IST

ప్రభుత్వం 8 నెలలుగా జీతాలు ఇవ్వటం లేదని ఎయిడెడ్ ఉపాధ్యాయులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్​పై హైకోర్టు ధర్మాసనం ఇవాళ విచారణ చేపట్టింది. జీతాలు అందకపోవటంతో ఎయిడెడ్‌ ఉపాధ్యాయులు ఇబ్బందులు పడుతున్నారని పిటిషనర్ల తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. వాదనలు విన్న న్యాయస్థానం వెంటనే జీతాలు చెల్లించాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ.. మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

ABOUT THE AUTHOR

...view details