Justice Battu Devanand visits old age home: విజయవాడ నగర శివారు రాజీవ్ నగర్లో నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వృద్ధాశ్రమాన్ని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ సందర్శించారు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని నగర మున్సిపల్ కమిషనర్ ప్రసన్న వెంకటేష్ దంపతులతో కలిసి వృద్ధులకు దుస్తులు, పండ్లు పంపిణీ చేశారు.
అనంతరం కేక్ కట్ చేసి.. కొత్త సంవత్సర వేడుకలు నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన జస్టిస్ బట్టు దేవానంద్.. ఇటువంటి వృద్ధాశ్రమాలను ఉన్నతాధికారులు పర్యవేక్షించాలని కోరారు. అవసాన దశలో ఉన్న వృద్ధులు రోడ్డుపాలు కాకుండా చర్యలు చేపట్టాలని సూచించారు.