ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Feb 16, 2021, 5:27 AM IST

ETV Bharat / city

హెచ్ఆర్సీ ఏర్పాటుకు ఇప్పటివరకూ ఏం చర్యలు తీసుకున్నారు : హైకోర్టు

హెచ్‌ఆర్సీ ఏర్పాటుకు ఇప్పటివరకూ ఏం చర్యలు తీసుకున్నారని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. సీఎం ఆధ్వర్యంలోని స్క్రీనింగ్ కమిటీ ఒక్కసారైనా సమావేశమైందా అని వ్యాఖ్యానించింది. కరోనా, తదితర కారణాలతో జాప్యం జరిగిందని ప్రభుత్వ న్యాయవాది పేర్కొన్నారు.

ap-high-court-asking-government-to-establish-on-hrc
హెచ్ఆర్సీ ఏర్పాటుకు ఇప్పటివరకూ ఏం చర్యలు తీసుకున్నారు : హైకోర్టు

మానవ హక్కుల సంఘం ఏర్పాటుకు ఇప్పటివరకూ ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ వ్యవహారంపై సీఎం ఆధ్వర్యంలోని స్క్రీనింగ్ కమిటీ ఒక్కసారైనా సమావేశమైందా అని ప్రశ్నించింది. మానవ హక్కుల కమిషన్ ఏర్పాటులో చర్చే అవసరం లేదన్న హైకోర్టు.... ఇప్పటివరకూ ఏర్పాటు చేయకపోవడం సరికాదని పేర్కొంది.

గతంలో కోర్టు ఆదేశించినా ఏర్పాటు చేయలేదంటూ ఏపీ పౌరహక్కుల సమాఖ్య ధిక్కరణ వ్యాజ్యం దాఖలు చేసింది. కరోనా, తదితర కారణాలతో జాప్యం జరిగిందన్న ప్రభుత్వ న్యాయవాది సాధ్యమైనంత త్వరగా నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. కరోనా కారణంగా జాప్యం చోటు చేసుకుంటే తాము అర్థం చేసుకోగలం కాని ఎన్నికల కోడ్ లాంటి కారణాలు సరికావని న్యాయస్థానం పేర్కొంది. అనంతరం... పురోగతి తెలపాలని ఆదేశిస్తూ మార్చి 22 కి విచారణను వాయిదా వేసింది.

ఇదీచదవండి.

ఆర్టీసీలో టికెట్​ రిజర్వేషన్​ కోసం కొత్తగా రెండు వెబ్​సైట్లు

ABOUT THE AUTHOR

...view details