పురపాలక ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 10న హైకోర్టుకు సెలవు ప్రకటించారు. దీనికి బదులుగా మే 1 న పనిదినంగా పేర్కొన్నారు. హైకోర్టు పరిపాలన నియంత్రణలో ఉండే ఏపీ లీగల్ సర్వీసు అథారిటీ, హైకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ, మధ్యవర్తిత్వ కేంద్రానికి సెలువుల వర్తిస్తాయని తెలిపింది.
మరోవైపు ఏపీ హైకోర్టు ఎంప్లాయీస్ సర్వీసు అసోసియేషన్ సమర్పించిన వినతిని పరిగణనలోకి తీసుకుని మహాశివరాత్రి మరుసటి రోజు ఈనెల 12 హైకోర్టుకు సెలవు ఇచ్చారు. ఈ సెలవుగా బదులుగా మార్చి 20న హైకోర్టు పనిదినంగా పేర్కొన్నారు. హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ బీఎస్ భానుమతి ఈ మేరకు ఉత్తర్వులిచ్చారు.