AP Health Department On Omicron variant: ఒమిక్రాన్ విజృంభణ నేపథ్యంలో విదేశాల నుంచి రాష్ట్రానికి వచ్చిన 30 మంది ప్రయాణికులు పరీక్షలు లేకుండా వెళ్లారన్న వార్తల్లో వాస్తవం లేదని.., ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాష్ట్ర వైద్యారోగ్య కుటుంబ సంక్షేమశాఖ డైరెక్టర్ హైమావతి స్పష్టం చేశారు. విదేశాల నుంచి రాష్ట్రానికి వస్తున్న వారిని వారి ఇళ్లలోనే హెం ఐసోలేషన్లో ఉంచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఆమె తెలిపారు. విశాఖ, సమీప జిల్లాలకు చెందిన 30 మంది అంతర్జాతీయ ప్రయాణికుల వివరాలను కేంద్రం పంపిందని వివరించారు. వారు తమ ఇళ్లల్లోనే ఐసొలేషన్లో ఉండేలా వైద్య బృందాలు పర్యవేక్షిస్తున్నాయని స్పష్టం చేశారు.
Home Isolation For Foreign Travelers: 'ఆ వార్తల్లో వాస్తవం లేదు..విదేశాల నుంచి వచ్చేవారికి హోం ఐసోలేషన్' - ఏపీలో ఒమిక్రాన్ కేసులు
Omicron variant News: ఒమిక్రాన్ వైరస్ వ్యాప్తి దృష్ట్యా విదేశాల నుంచి రాష్ట్రానికి వస్తున్న వారిని వారి ఇళ్లలోనే హెం ఐసోలేషన్లో ఉంచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర వైద్యారోగ్య కుటుంబ సంక్షేమశాఖ డైరెక్టర్ హైమావతి స్పష్టం చేశారు. విదేశాల నుంచి రాష్ట్రానికి వచ్చిన 30 మంది ప్రయాణికులు పరీక్షలు లేకుండా ఇళ్లకు వెళ్లారన్న వార్తల్లో వాస్తవం లేదని.., ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.
మన రాష్ట్రంలో విదేశీ ప్రయాణికులు నేరుగా దిగేందుకు అంతర్జాతీయ విమానాశ్రయాలు లేవని హైమావతి గుర్తు చేశారు. కేంద్రం అమలు చేస్తున్న వందే భారత్ పథకం కింద విజయవాడ విమానాశ్రయానికి కొన్ని విమానాలొస్తున్నాయని.., అందులో మన రాష్ట్రానికి వచ్చే వారికి కేంద్ర ప్రభుత్వ ప్రోటోకాల్ ప్రకారం వైద్య బృందాలు పరీక్షలు నిర్వహిస్తున్నాయని వెల్లడించారు. రాష్ట్రంలోని అన్ని విమానాశ్రయాల్లో ఇప్పటికే వైద్య బృందాలను ఏర్పాటు చేశామని, ఈ బృందాల పర్యవేక్షణలో నిరంతరం స్క్రీనింగ్ టెస్టులు కొనసాగిస్తున్నారని హైమావతి వివరించారు.
ఇదీ చదవండి: COVID Cases in Telangana: హైదరాబాద్ లో కలవరం.. విదేశాల నుంచి వచ్చిన 12 మందికి పాజిటివ్