ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

HC Fire On Medical Director: 'మా ఆదేశాలు పట్టవా ?'..వైద్యవిద్య అధికారులపై హైకోర్టు ఆగ్రహం - వైద్యవిద్య అధికారులపై హైకోర్టు ఆగ్రహం

AP HC Serious On Medical Director: తాము ఆదేశించినా ఉద్యోగిని విధుల్లోకి తీసుకోకపోవటంపై వైద్యవిద్య మాజీ డైరెక్టర్, ప్రస్తుత డైరెక్టర్​పై రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. హైకోర్టు ఆదేశాలు పాటించలేదని ఉద్యోగి చుక్క శరత్ పిటిషన్​పై విచారించిన న్యాయస్థానం..కోర్టు ఆదేశాలు పాటించకోవటం తగదని అధికారులకు హితవు పలికింది.

వైద్యవిద్య అధికారులపై హైకోర్టు ఆగ్రహం
వైద్యవిద్య అధికారులపై హైకోర్టు ఆగ్రహం

By

Published : Dec 3, 2021, 9:27 PM IST

AP HC Serious On Medical Director: కోర్టు ధిక్కరణ కేసులో వైద్యవిద్య మాజీ డైరెక్టర్, ప్రస్తుత డైరెక్టర్ హైకోర్టు ముందు హాజరయ్యారు. తాము ఆదేశించినా ఉద్యోగిని విధుల్లోకి తీసుకోలేదని వారిపై రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. హైకోర్టు ఆదేశాలు పాటించలేదని ఉద్యోగి చుక్క శరత్ పిటిషన్​పై విచారించిన న్యాయస్థానం..కోర్టు ఆదేశాలు పాటించకపోవటం తగదని అధికారులకు హితవు పలికింది. పిటిషనర్ తరపున వాదనలు వినిపించిన న్యాయవాది శ్రవణ్ కుమార్..2020లో మరోసారి కోర్టు ఆదేశించినా అధికారులు పట్టించుకోలేదన్నారు. వాదనలు విన్న న్యాయస్థానం..ధిక్కరణ కేసు విచారణను డిసెంబర్​ 17కి వాయిదా వేసింది.

ABOUT THE AUTHOR

...view details