ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'ఇళ్లపట్టాల పంపిణీపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయండి' - ఇళ్లపట్టాల పంపిణీపై హైకోర్టులో వాదనలు తాజా వార్తలు

ఇళ్లపట్టాల పంపిణీపై అత్యవసర విచారణ జరపాలని వేసిన పిటిషన్​పై హైకోర్టు విచారణ చేపట్టింది. ఇళ్లపట్టాల పంపిణీ ద్వారా శాసనసభ, పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజనకు అవకాశం ఉందని... అందువల్ల పంపిణీపై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని పిటిషనర్ హైకోర్టులో వాదనలు వినిపించారు. దీనిపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ధర్మాసనం ఆదేశించింది.

'ఇళ్లపట్టాల పంపిణీపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయండి'
'ఇళ్లపట్టాల పంపిణీపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయండి'

By

Published : Dec 24, 2020, 5:42 PM IST

ఈనెల 25న రాష్ట్ర ప్రభుత్వం చేపట్టనున్న ఇళ్ల పట్టాల పంపిణీపై అత్యవసర విచారణ జరపాలని వేసిన పిటిషన్​పై హైకోర్టు విచారణ జరిపింది. ప్రభుత్వం ఈనెల 25న ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు సిద్ధమవుతోందని పిటిషనర్ తరపు న్యాయవాది డీఎస్​ఎన్​వీ. ప్రసాద్​బాబు కోర్టుకు విన్నవించారు. 35 లక్షల మంది లబ్ధిదారులకు పట్టాలివ్వనున్నట్లు తెలిపారు. 35 లక్షల మంది లబ్ధిదారుల కుటుంబ సభ్యుల్లో..సగటున ఒక్కో కుటుంబంలో ముగ్గురు ఓటర్ల చొప్పున మొత్తం కోటి ఓటర్లు ఉంటారన్నారు.

కోటి ఓటర్లను ఏకపక్షంగా ఒకచోట నుంచి మరోచోటుకు తరలిస్తే...శాసనసభ, పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజనకు దారితీసే పరిస్థితి ఉందని వాదించారు. లబ్ధిదారుల్లో ఎక్కువ మంది బలహీన వర్గాలు, ఎస్సీ, ఎస్టీలకు చెందినవారని... దీంతో ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాలపై ఆ ప్రభావం ఎక్కువగా పడే అవకాశం ఉందన్నారు. ప్రజలు వేరే ప్రాంతానికి తరలిపోయేలా ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తోందన్నారు. ఇళ్ల పట్టాల పంపిణీపై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. దీనిపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ధర్మాసనం ఆదేశించింది.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details