ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Aasara Scheme: ఈనెల 7న రెండో విడత 'ఆసరా'..ప్రారంభించనున్న సీఎం జగన్ - ఆసరా రెండో విడత డబ్బులు

స్వయం సహాయ సంఘాల మహిళలకు ఆర్థిక తోడ్పాటునందించేందుకు ప్రభుత్వం తీసుకొచ్చిన ఆసరా పథకం రెండో విడత కార్యక్రమాన్ని సీఎం జగన్ ఈ నెల 7న ప్రారంభించనున్నారు. మొత్తం 8 లక్షల 42 డ్వాక్రా సంఘాల్లోని 78 లక్షల 75 వేల మంది మహిళల ఖాతాలకు ఆసరా రెండో విడత నిధులు జమ కానున్నాయి. ఇందుకోసం రూ. 6470 కోట్ల నిధులు కేటాయించారు.

ఈనెల 7న రెండో విడత 'ఆసరా'
ఈనెల 7న రెండో విడత 'ఆసరా'

By

Published : Oct 4, 2021, 7:48 PM IST

ఆసరా పథకం రెండో విడత నిధుల్ని ముఖ్యమంత్రి జగన్ ఈ నెల 7న స్వయం సహాయ సంఘాల మహిళల ఖాతాలకు జమ చేయనున్నారు. నిధులు లేక గత నెలలో చేపట్టాల్సిన ఈ పథకాన్ని ప్రభుత్వం అక్టోబరు 7కి వాయిదా వేసింది. వైఎస్సార్ ఆసరా పథకంలో భాగంగా 8 లక్షల 42 వేల డ్వాక్రా సంఘాల్లోని 78 లక్షల 75 వేల 599 మంది మహిళల వ్యక్తిగత ఖాతాలకు నగదు జమ చేయనున్నారు. రూ. 6470 కోట్లను మహిళల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేయనుంది.

ఎన్నికల హామీ మేరకు 2019 ఏప్రిల్ 11వ తేదీ ముందు వరకూ బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను ప్రభుత్వం చెల్లిస్తుందంటూ సీఎం జగన్ ప్రకటించారు. ఈ మేరకు మొత్తం రూ. 25,579 కోట్ల రుణాలను నాలుగు విడతల్లో డ్వాక్రా సంఘాల మహిళలకు చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా మొదటి విడతగా గత ఏడాది సెప్టెంబరు 11న రూ. 6330 కోట్ల మొత్తాన్ని డ్వాక్రా మహిళల ఖాతాల్లోకి నగదు బదిలీ రూపంలో ప్రభుత్వం చెల్లించింది. ఈ ఏడాది కూడా సెప్టెంబరు నెలలోనే చెల్లించాలని భావించినా..నిధులు లేకపోవటంతో ఆసరా రెండో విడత అమలును అక్టోబరు 7కు వాయిదా వేశారు.

ప్రస్తతం వైఎస్సార్ ఆసరా రెండో విడత మొత్తాన్ని ఈ నెల 7న చెల్లించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. సీఎం క్యాంపు కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి జగన్ మీట నొక్కి ఈ మొత్తాలను మహిళల ఖతాలకు బదిలీ చేయనున్నారు.

ఇదీ చదవండి

Drug free Universities: కాలేజీలు, యూనివర్శిటీల్లో మాదకద్రవ్యాల ఆనవాళ్లు ఉండొద్దు: సీఎం జగన్

ABOUT THE AUTHOR

...view details