ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

బీసీజీకి రూ. 3.51 కోట్ల చెల్లింపులు...ప్రభుత్వ ఉత్తర్వులు జారీ - బీసీజీకి రూ. 3.51 కోట్ల చెల్లింపులు

పాలనా వికేంద్రీకరణపై ప్రాజెక్టు నివేదిక సమర్పించిన బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్​నకు ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. నివేదిక రూపకల్పన కోసం 7 కోట్ల 2 లక్షల 10 వేలకు ఒప్పందం చేసుకోగా...మెుదటి విడతగా 3 కోట్ల 51 లక్షల 5 వేల చెల్లిపులకు పాలనామోదం తెలుపుతూ ఉత్తర్వులు జారీ చేసింది.

బీసీజీకి రూ. 3.51 కోట్ల చెల్లింపులు...ప్రభుత్వ ఉత్తర్వులు జారీ !
బీసీజీకి రూ. 3.51 కోట్ల చెల్లింపులు...ప్రభుత్వ ఉత్తర్వులు జారీ !

By

Published : Jun 25, 2020, 3:06 PM IST

పాలనా వికేంద్రీకరణపై ప్రాజెక్టు నివేదిక సమర్పించిన బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్​నకు మొదటి విడతగా 3 కోట్ల 51 లక్షల 5 వేలు చెల్లింపులు చేసేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. మొత్తం ప్రాజెక్టు నివేదిక రూపకల్పన కోసం 7 కోట్ల 2 లక్షల 10 వేల రూపాయలను చెల్లించేలా ఒప్పందం కుదుర్చుకున్న ప్రణాళికా విభాగం.. సాంకేతిక కారణాలతో గత ఏడాది చెల్లింపులు చేయలేకపోయింది.

గత ఏడాదికి సంబంధించిన ఈ చెల్లింపులు నిలిచిపోవటంతో ప్రత్యేకంగా 2020-21 బడ్జెట్​లో ఆ మొత్తం నిధులను చెల్లించేందుకు అనుమతినిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో మొదటి విడతగా 3 కోట్ల 51 లక్షల 5 వేల రూపాయల చెల్లింపునకు పాలనామోదం తెలుపుతూ ప్రణాళికా విభాగం ఉత్తర్వులు ఇచ్చింది.

ఇదీ చదవండి: కరోనా ఎఫెక్ట్: నాలుగు రోజులపాటు హైకోర్టు కార్యకలాపాలు రద్దు

ABOUT THE AUTHOR

...view details