ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్లు, సరఫరా కోసం రూ.309 కోట్లు కేటాయింపు - కొవిడ్ వైద్యం కోసం ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటు వార్తలు

కొవిడ్ వైద్యం కోసం ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్ల ఏర్పాటు, ఆక్సిజన్ సరఫరా కోసం రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. వీటి ఏర్పాటు కోసం రూ. 309.87 కోట్లు కేటాయించింది. పరిపాలన పరమైన అనుమతిస్తూ వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ ఉత్తర్వులు జారీ చేశారు.

ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్లు, సరఫరా కోసం రూ.309 కోట్లు కేటాయింపు
ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్లు, సరఫరా కోసం రూ.309 కోట్లు కేటాయింపు

By

Published : May 9, 2021, 8:33 PM IST

ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు, ఆక్సిజన్ సరఫరా కోసం రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించింది. 180.19 కోట్లు వెచ్చించి రాష్ట్రంలో 49 చోట్ల ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. 50 క్రయోజనిక్ ఆక్సిజన్ ట్యాంకర్ వాహనాలు కొనుగోలు చేయాలనీ నిర్ణయించారు. దీనికోసం 46.08 కోట్లు వెచ్చించనున్నారు.

ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చేసే ప్రాంతాల్లో సివిల్, ఎలక్ట్రిక్ పనుల కోసం 25.80 కోట్లు ఖర్చు చేయనున్నారు. 50 కోట్లతో 10 వేల అదనపు ఆక్సిజన్ పైప్ లైన్లు ఏర్పాటు చేయాలని ఆదేశాల్లో తెలిపారు. ఆక్సిజన్ ప్లాంట్ల నిర్వహణ కోసం ప్రతి జిల్లాకు రాబోయే 6 నెలలకు 60 లక్షలు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వెంటనే తగు చర్యలు తీసుకోవాలని ఏపీ మెడికల్ సర్వీసెస్, ఇన్ ఫ్రా స్ట్రక్చర్ అభివృద్ధి కార్పొరేషన్ ఎండీని ప్రభుత్వం ఆదేశించింది.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details