Covid guidelines: రాష్ట్రంలో కొవిడ్ వ్యాప్తి నిరోధానికి ప్రభుత్వం మరోమారు మార్గదర్శకాలు విడుదల చేసింది. కేంద్ర హోం శాఖ, ప్రపంచ ఆరోగ్య సంస్థ జారీ చేసిన మార్గదర్శకాలను కఠినంగా అమలు చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా కొత్త నిబంధనలు జారీ చేసింది.
నూతన మార్గదర్శకాల ప్రకారం.. పౌరులు బహిరంగ ప్రదేశాల్లో మాస్కు ధరించకపోతే.. 100 రూపాయల జరిమానా విధిస్తామంటూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆ విషయంలో వ్యాపార సముదాయాలకు మాత్రం భారీ హెచ్చరికలు చేసింది. మాస్కు లేని వారిని దుకాణాలు, వాణిజ్య ప్రదేశాలు, వ్యాపార సంస్థల ప్రాంగణాల్లోకి అనుమతిస్తే.. సదరు యాజమాన్యానికి రూ.10 వేల నుంచి 25 వేల మేర జరిమానా విధించాలని ఆదేశించింది.