2020-21 విద్యా సంవత్సరానికి గాను ఇంటర్మీడియట్ విద్యాశాఖ కమిషనర్ నిర్దేశించిన మార్గదర్శకాలు, నిబంధనలకు తుది రూపు ఇచ్చేందుకు.. ఉన్నత స్థాయి అధికారుల కమిటీని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. ఇంటర్, పాఠశాల విద్యా శాఖల కమిషనర్లు, ఆంగ్ల మాధ్యమ ప్రాజెక్టు ప్రత్యేక అధికారి వెట్రిసెల్వి, ఎస్సీఈఆర్టీ డైరెక్టర్లతో కూడిన కమిటీని ఏర్పాటు చేస్తూ.. పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బి.రాజశేఖర్ ఉత్తర్వులు ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ ఇంటర్ విద్యా చట్టం 1971కి అనుగుణంగా నూతనంగా రూపకల్పన చేసిన మార్గదర్శకాలు, నిబంధనలకు అధికారుల కమిటీ తుది రూపు ఇవ్వనుంది.
ఇంటర్ కళాశాలల అఫిలియేషన్ మార్గదర్శకాలు, నిబంధనలపై కమిటీ - ఇంటర్ బోర్డు తాజా వార్తలు
ఆంధ్రప్రదేశ్లో ఇంటర్మీడియట్ కళాశాలల అఫిలియేషన్ మార్గదర్శకాలు, నిబంధనలకు తుది రూపు ఇచ్చేందుకు అధికారుల కమిటీని నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బి.రాజశేఖర్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.
ap govt go on inter affiliation commitee