ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

అర్ధరాత్రి 12 వరకు రెస్టారెంట్లు,హోటళ్లకు అనుమతి.. ప్రభుత్వ ఉత్తర్వులు జారీ - హెటళ్లకు ప్రభుత్వ అనుమతి

రెస్టారెంట్లు, హోటళ్లకు అర్ధరాత్రి 12 వరకు తెరిచేందుకు ప్రభుత్వం అనుమతిచ్చింది. బార్లు, రెస్టారెంట్లు మినహా హోటళ్లు ఉదయం 5 నుంచి రాత్రి 12 వరకు తెరిచేందుకు సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

ప్రభుత్వ ఉత్తర్వులు జారీ
ప్రభుత్వ ఉత్తర్వులు జారీ

By

Published : Jun 13, 2022, 10:15 PM IST

రాష్ట్రవ్యాప్తంగా రెస్టారెంట్లు, హోటళ్లు, ఇతర తినుబండారాల దుకాణాలను అర్ధరాత్రి 12 గంటల వరకూ తెరుచుకునేందుకు ప్రభుత్వం అనుమతి జారీ చేసింది. బార్‌ అండ్‌ రెస్టారెంట్లు మినహా ఇతర హోటళ్లు, ఈటరీస్‌ను ఉదయం 5 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకూ తెరిచి ఉంచేందుకు కార్మికశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దుకాణాలు - సంస్థల చట్టం 1988 సెక్షన్‌ 7ను అనుసరించి ఈ వెసులుబాటు కల్పిస్తున్నట్టు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కంది.

రాష్ట్రంలో హోటల్‌ పరిశ్రమకు చెందిన సంఘాలు చేసిన విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వం తెలిపింది. 2022 మార్చి 14 తేదీ నుంచి ఎలాంటి కొవిడ్‌ నిషేదాజ్ఞలు అమల్లో లేనందున హోటళ్లు, రెస్టారెంట్లు రాత్రి 12 వరకూ తెరుచుకునేందుకు అనుమతిస్తున్నట్టు ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టంచేసింది.

ఇవీ చూడండి

ABOUT THE AUTHOR

...view details