ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

గుట్కా నిషేధం బాధ్యత ఇకపై వారిదే.. సర్కారు నిర్ణయం - గుట్కా నిషేధం బాధ్యతలు పోలీసులకు

ప్రజల ఆరోగ్యాన్ని హరించే హానికరమైన గుట్కా, జర్దా, పాన్‌మసాలా తయారీ, విక్రయాల నిషేధానికి రాష్ట్ర ప్రభుత్వం (ap govt) ప్రత్యేక చట్టం తీసుకురాబోతోంది. దీని ప్రకారం వీటిని అడ్డుకునే అధికారం ఇకపై పోలీసులకు రానుంది. క్యాన్సర్‌ సహా ఇతర ఆరోగ్య సమస్యలకు కారణమవుతున్నందునే వీటిని నిషేధిస్తూ కొత్త చట్టం తీసుకొస్తున్నట్లు ప్రభుత్వం రూపొదించిన ముసాయిదా పేర్కొంది. రానున్న శాసనసభ సమావేశాల్లో ఈ బిల్లు ప్రవేశపెట్టే అవకాశం ఉంది.

గుట్కా
గుట్కా

By

Published : Nov 7, 2021, 8:30 AM IST

Updated : Nov 7, 2021, 11:37 AM IST

గుట్కా నిషేధం బాధ్యత ఇకపై వారిదే.. సర్కారు నిర్ణయం

రాష్ట్రంలో గుట్కా వంటి హానికరమైన పదార్థాలను నిషేంధించేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ముఖ్యంగా యువతి ఇలాంటి హానికరమైన పదార్థాలకు అలవాటుపడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారని...క్యాన్సర్‌ వంటి భయంకరమైన వ్యాధులకు గురవుతున్నారని ప్రభుత్వం భావిస్తోంది. వీటి విక్రయాలపై ఇప్పటికే ఆంక్షలు విధించినా...అక్రమ రవాణా కొనసాగుతోంది. దీంతో వీటిని శాశ్వతంగా నిషేధిస్తూ చట్టం తీసుకురాబోతోంది. ఈ చట్టం ప్రకారం రాష్ట్రంలో గుట్కా, జర్ధా, పాన్‌మసాలా, తయారు చేసినా...విక్రయించినా శిక్షార్హులు. ఎస్సై(S.I.)స్థాయి అధికారి సైతం గుట్కా అమ్మకాలపై చర్యలు తీసుకునే అవకాశం కల్పించనున్నారు.

ప్రస్తుతం రాష్ట్రంలో గుట్కా విక్రయాలు అడ్డుకునే అధికారం రాష్ట్ర ఆహార భద్రత అధికారులకు ఉంది. వీటి విక్రయాలను నిషేధిస్తూ ఫుడ్‌సేప్టీ కమిషనర్ ఏటా ఉత్తర్వులు జారీ చేస్తున్నారు. దీనిపై ఓ ఏజెన్సీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. నిషేధంపై ఉత్తర్వులు జారీ చేసే అధికారం పుడ్‌సేప్టీ అధికారులకు లేదంటూ న్యాయస్థానం స్టే విధించింది. దీనిపై డివిజన్ బెంజ్‌లో ప్రస్తుతం విచారణ సాగుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలో తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు కేసులు నమోదు చేయవద్దంటూ రాష్ట్ర ఫుడ్‌సేప్టీ కమిషనర్ తమ సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు.

ఈ నేపథ్యంలోనే హానికరమైన గుట్కా విక్రయాలను నిషేధిస్తూ బిల్లు ముసాయిదాని ప్రభుత్వం సిద్ధం చేసింది. దీని ప్రకారం గుట్కా వ్యవహారాలు నేరుగా పోలీసుశాఖ పరిధిలోకి వెళ్లనున్నాయి. వారి అధికారాలు సైతం పెరగనున్నాయి. కేసు నమోదు చేస్తే నిందితులకు ఏడేళ్ల జైలు శిక్షతోపాటు లక్షకు తగ్గకుండా 5 లక్షల వరకు జరిమానా విధించే అవకాశం ఉంది.


ఇదీ చదవండి:VIVEKA MURDER CASE : వివేకా హత్యలో ఉమాశంకర్‌రెడ్డి పాత్ర

Last Updated : Nov 7, 2021, 11:37 AM IST

ABOUT THE AUTHOR

...view details