Chandrashekar reddy: మంత్రుల కమిటీ మంగళవారం స్టీరింగ్ కమిటీతో మాట్లాడిందని.. ప్రభుత్వ సలహాదారు చంద్రశేఖర్‌రెడ్డి అన్నారు. మూడు డిమాండ్లు పరిష్కరించాలని ఉద్యోగులు కోరుతున్నారని.. పెరిగిన వేతనాలు ఇప్పటికే ఉద్యోగుల ఖాతాలో పడ్డాయని తెలిపారు. చలో విజయవాడపై ఉద్యోగ సంఘాలు పునరాలోచించాలని కోరారు.
ప్రభుత్వంతో చర్చలకు ఉద్యోగసంఘాలు ముందుకు రావాలి. ఉద్యోగుల పట్ల సీఎం జగన్ సానుకూలంగా ఉన్నారు. కరోనా వల్ల కోరిన పీఆర్సీ ఇవ్వలేకపోయామని ప్రభుత్వం చెబుతోంది. హెచ్‌ఆర్‌ఏ, ఐఆర్, ఇతర అలవెన్సులపై మాట్లాడాలి. చర్చలు జరిపితేనే సమస్యలు పరిష్కారమవుతాయి.ఉద్యోగులు పెద్ద మనసుతో ఆలోచించాలి. సమస్యను మంత్రుల కమిటీ లేదా సీఎం దృష్టికి తీసుకెళ్లాలి. చర్చల కోసం మంత్రుల కమిటీ ఎదురుచూస్తోంది, వచ్చి మాట్లాడాలి. చలో విజయవాడ కార్యక్రమం వాయిదా వేసి చర్చలు జరపాలని కోరుతున్నా. పీఆర్సీ నివేదికలు ఒక్కోసారి ఒక్కోలా ఉంటాయి. -చంద్రశేఖర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు