AP Govt Advance Notices To Theaters: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ 'భీమ్లా నాయక్' చిత్రం శుక్రవారం విడుదల కానున్న నేపథ్యంలో.. థియేటర్లకు ప్రభుత్వం ముందస్తు నోటీసులిచ్చింది. బెనిఫిట్ షోలు, అదనపు ప్రదర్శనలు వేస్తే.. కఠిన చర్యలు తప్పవంటూ.. అధికారులు నోటీసుల్లో స్పష్టం చేశారు.
Notices To Theaters: రాష్ట్రంలో థియేటర్లకు ప్రభుత్వం ముందస్తు నోటీసులు - భీమ్లానాయక్ సినిమా విడుదల నేపథ్యంలో థియేటర్లకు నోటీసులు
20:54 February 23
notices to theaters in ap: 'భీమ్లానాయక్' సినిమా విడుదల నేపథ్యంలో నోటీసులు
జీవో నెంబర్ 35 ప్రకారం టిక్కెట్లు అమ్మకుంటే.. సినిమాటోగ్రఫీ చట్టం-1952 ప్రకారం చర్యలు తప్పవంటూ..కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు తహసీల్దార్ హెచ్చరించారు. గుంటూరు జిల్లాలోనూ ప్రస్తుత నిబంధనలు అమలు చేయాలంటూ..తహసీల్దార్లకు టెలీకాన్ఫరెన్స్ ద్వారా ఉన్నతాధికారులు ఆదేశాలిచ్చారు. వీఆర్ఓ లను థియేటర్ల దగ్గరకు పంపాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. తూర్పుగోదావరి జిల్లాలోని అన్ని థియేటర్లలో....మరుగుదొడ్ల నిర్వహణ, ఇతర సౌకర్యాలను పరిశీలించారు. విశాఖ జిల్లా అనకాపల్లి, పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులోనూ..పరిస్థితి ఇలాగే ఉంది.
ఇదీ చదవండి:
భీమ్లా నాయక్ vs అయ్యప్పనుమ్ కోశియుమ్.. ఏయే పాత్రలు ఎవరు చేశారు?