హైదరాబాద్ ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్.. డిశ్చార్జ్ అయ్యారు. విజయవాడలోని రాజ్ భవన్లో గవర్నర్ దంపతులకు రాజ్ భవన్ సంయుక్త కార్యదర్శి శ్యామ్ ప్రసాద్, తదితరులు స్వాగతం పలికారు.
నేను అన్ని విధాల పూర్తి ఆరోగ్యంగా ఉన్నాను. ప్రపంచవ్యాప్తంగా కొత్త వేరియంట్లు విజృంభిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ప్రభుత్వ సూచనల మేరకు వ్యవహరించాలి. మాస్కులు ధరించడం, చేతులు పరిశుభ్రంగా ఉంచుకోవటం, భౌతి దూరం పాటించడం వంటి నిబంధనలు తప్పనిసరిగా పాలించాలి. - బిశ్వభూషణ్ హరిచందన్, గవర్నర్
కరోనా తదనంతర అనారోగ్య సమస్యలతో గత కొద్ది రోజులుగా హైదరాబాద్లోని ఏజీఐ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న గవర్నర్ దంపతులు బిశ్వభూషణ్ హరిచందన్, సుప్రవ హరిచందన్..విజయవాడ చేరుకున్నారు. కరోనా నుంచి కోలుకున్నప్పటికీ.. తరువాత ఆరోగ్య పరంగా స్వల్ప సమస్యలు రావడంతో వీరిని ప్రత్యేక విమానంలో హైదరాబాద్లోని ఏషియన్ ఇన్ స్టిట్యూట్ ఆప్ గ్యాస్ట్రోఎంట్రాలజీ(ఏఐజి) హాస్పిటల్కు తరలించారు. అయితే.. ప్రస్తుతం గవర్నర్ దంపతులు ఇరువురు పూర్తిగా కోలుకున్నట్లు ఏఐజీ ఆసుపత్రి వైద్యులు బుధవారం తెలిపారు.