రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, సుప్రవ హరిచందన్ దంపతుల 56వ వివాహ వార్షికోత్సవ వేడుక... విజయవాడ రాజ్ భవన్లో జరిగింది. కరోనా నేపథ్యంలో.. నిరాడంబరంగా వేడుక నిర్వహించారు. కేవలం రాజ్ భవన్ ఉన్నతాధికారులు మాత్రమే గవర్నర్ దంపతులను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
గవర్నర్ కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా, సంయుక్త కార్యదర్శి శ్యామ్ ప్రసాద్ తదితరులు గవర్నర్ దంపతులను సన్మానించారు. వివాహ వేడుక జ్ఞాపకాలను గవర్నర్ గుర్తు చేసుకున్నారు. సీఎం జగన్, భారతి రెడ్డి దంపతులు.. బిశ్వభూషన్ హరిచందన్ దంపతులకు చరవాణిలో శుభాకాంక్షలు తెలిపారు. ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. గవర్నర్ దంపతులు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.