మహాకవి గురజాడ వెంకట అప్పారావు జయంతిని పురస్కరించుకుని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ నివాళులు అర్పించారు. నాటి సామాజిక సమస్యలపై గురజాడ తన సాహిత్యం ఆలంబనగా గళం విప్పారని అన్నారు. ప్రసిద్ధ తెలుగు నాటక రచయితగా, కవిగా ఆయన సేవలు నిరుపమానమని కొనియాడారు. 1892లో గురజాడ రాసిన కన్యాశుల్కం నాటకం విమర్శకుల ప్రశంసలు అందుకున్న విషయాన్ని గుర్తు చేసుకున్నారు. ఇది తెలుగు భాషలో గొప్ప నాటకంగా అభివర్ణించారు. నేటికీ కన్యాశుల్కం నాటకాన్ని అజరామరంగా ప్రదర్శిస్తున్నారన్నారు. 1910లో గురజాడ రాసిన "దేశమును ప్రేమించుమన్న" అన్న దేశభక్తి గీతం ఎందరో స్వాతంత్య్ర సమరయోధులకు స్ఫూర్తిదాయకంగా నిలిచిందని కొనియాడారు.
మహాకవికి సీఎం జగన్ నివాళులు..